Page Loader
దిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేడయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా‌ 

దిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టేడయంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మనీష్ సిసోడియా‌ 

వ్రాసిన వారు Stalin
May 30, 2023
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ మద్యం పాలసీ అమలులో అవినీతి జరిగిందన్న సీబీఐ కేసులో ఆప్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. జస్టిస్ దినేష్ కుమార్ శర్మతో కూడిన ధర్మాసనం సిసోడియాకు బెయిల్ నిరాకరించింది. దరఖాస్తుదారు (సిసోడియా) శక్తివంతమైన వ్యక్తి కావడంతో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొంది. వాదనల సమయంలో మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను సీబీఐ వ్యతిరేకించింది. దిల్లీ హైకోర్టు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ హైకోర్టులో సిసోడియాకు చుక్కెదురు