Page Loader
Telangana Elections: బర్రెలక్క భద్రతపై ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు 
Telangana Elections: బర్రెలక్కకు భద్రత కల్పించండి: హైకోర్టు

Telangana Elections: బర్రెలక్క భద్రతపై ఎన్నికల సంఘానికి హైకోర్టు కీలక ఆదేశాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2023
04:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క(శిరీష)కు భద్రత కల్పించాలని హై కోర్టు ఆదేశించింది. ఎన్నికలు పూర్తయేవరకు బర్రెలక్క నిర్వహించే పబ్లిక్ మీటింగ్ లకు ఒక గన్ మెన్ తో భద్రత కల్పించాలని హై కోర్టు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపు ఉన్న పార్టీలకే భద్రత ఇస్తే సరిపోదని థ్రెట్ ఉందని అభ్యర్థించే అభ్యర్థులకు కూడా భద్రత ఇవ్వాలని పేర్కొంది. కాగా ఈ నెల 21న తన సోదరుడిపై దాడి జరగడంతో తనకు 2+2 గన్ మెన్లతో భద్రత కల్పించాలని బర్రెలక్క హై కోర్టు ని ఆశ్రయించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శిరీష(బర్రెలక్క)కు ఒక గన్‌మెన్‌తో భద్రత