Page Loader
హిమాచల్‌లో వరుణ విధ్వంసం.. 74 మంది మృతి, 10 వేల కోట్ల ఆస్తినష్టం
హిమాచల్‌లో ఇప్పటికే 74 మంది మృతి

హిమాచల్‌లో వరుణ విధ్వంసం.. 74 మంది మృతి, 10 వేల కోట్ల ఆస్తినష్టం

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 18, 2023
10:49 am

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్ ప్రదేశ్‌లో మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. గత కొద్దిరోజుల కిందట నుంచి కురుస్తున్న కుంభవృష్టి కారణంగా మరణించిన వారి సంఖ్య 74కి చేరుకుంది. రానున్న నాలుగైదు రోజుల్లో (ఆగస్ట్ 17-21) రాష్ట్రంలో మరిన్ని వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ కేంద్రం(IMD) ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఇళ్లు కూలిపోయి, రోడ్లు కొట్టుకుపోయాయి. దాదాపు 650 రోడ్లు మూసుకుపోయాయి. 1,135 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. 285 నీటి సరఫరా పథకాలకు అవాంతరాలు ఏర్పడ్డాయి. మరోవైపు ఇళ్లు కూలిన శిథిలాల వద్ద, కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మృతదేహాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి.

DETAILS

రుతుపవనాలు వచ్చినప్పట్నుంచి హిమాచల్‌లో వరుణ బీభత్సం 

జూన్ 24 నుంచి తమ రాష్ట్రంలో రుతుపవనాలు ప్రారంభమయ్యాయని, అప్పట్నుంచి కురిసిన భారీ వర్షాలతో హిమాచల్ మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు అన్నారు. జులైలో రెండు దఫాల్లో కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా దాదాపు రూ. 10,000 కోట్ల నష్టాన్ని చవిచూశామన్నారు. దెబ్బతిన్న రోడ్లు, నీటి ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి చాలా సమయం పడుతుందన్న ముఖ్యమంత్రి సుఖు, ఇందుకోసం ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేస్తోందన్నారు. ఏడాదిలోగా మౌలిక సదుపాయాలను యథావిధిగా పునరుద్ధరించేందుకు కార్యచరణ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఇది తమకు పర్వతం లాంటి పెద్ద సవాలుగా మారిందన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు