Page Loader
వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ
వచ్చే 3 రోజులు కోస్తా ఆంధ్ర, యానాంలో భారీ వర్షాలు

వచ్చే 3 రోజులు కోస్తాంధ్ర, యానాంలో భారీ వర్షాలు..ఆరెంజ్ అలెర్ట్ జారీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 18, 2023
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు పడనున్నాయి. రానున్న 3 రోజుల పాటు మోస్తారు వ‌ర్షాలు కురవనున్నాయి. ప‌లు చోట్ల భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంది. ఈ మేరకు అమరావతి వాతావ‌ర‌ణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ అలెర్ట్ సైతం జారీ అయ్యింది. మరోవైపు గురువారం ఉత్తర కోస్తా, ఏపీ (NCAP),యానాంలో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. దాదాపు 15 రోజుల తర్వాత తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన చేసింది వాతావరణ కేంద్రం. దక్షిణ కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి వల్ల వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఈ క్రమంలోనే శుక్ర,శనివారాతో పాటు ఆదివారం NCAP, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కోస్తాంధ్రకు మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన