Himanta Biswa Sarma: వివాదంలో చిక్కుకున్న అస్సాం సీఎం.. భగవద్గీత శ్లోకం పోస్ట్ తొలగింపు
భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని తప్పుగా అనువాదం చేసి X లో చేసిన పోస్టును అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తొలిగించారు. అదే సమయంలో ప్రజలకు క్షమాపణలు కూడా చెప్పారు. భగవద్గీత ప్రకారం,నిజానికి బ్రాహ్మణులకు, క్షత్రియులకు,వైశ్యులకు సేవ చేయడం శూద్రుల సహజ విధి అని ఆయన రాశారు. ఈ పోస్ట్ పై వివాదం రాచుకుంది. హిమంత శర్మ మంగళవారం పోస్ట్ చేసిన ఈ పోస్ట్,కుల విభజనను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీతో సహా పలువురు ప్రతిపక్ష నాయకులతో పెద్ద దుమారాన్ని సృష్టించారు. వివాదం అనంతరం హిమంత క్షమాపణలు చెప్పారు.
ట్వీట్‌ను తొలగించిన సీఎం
"రొటీన్‌గా నేను ప్రతిరోజూ ఉదయం నా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని అప్‌లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు, నేను 668 స్లోకాలను పోస్ట్ చేసాను. పొరపాటును గమనించిన వెంటనే పోస్ట్‌ను తొలగించిన ఆయన .. అస్సాం కులరహిత సమాజం, ఆదర్శ చిత్రాన్ని చూపుతుందన్నారు." ఆ ట్వీట్‌ను తొలగించినట్లు సీఎం శర్మ తెలిపారు. "తొలగించిన పోస్ట్ ఎవరినైనా బాధపెట్టినట్లయితే, నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను" అని హిమంత బిస్వా శర్మ గురువారం ఆయన X లో రాసుకొచ్చారు.