మహాభారతంలో లవ్ జీహాద్ ఉందంటూ ఘాటు విమర్శలు.. మండిపడ్డ హిమంత బిశ్వ శర్మ
లవ్ జీహాద్ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎప్పటి నుంచో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఈ వ్యవహరంపై అస్సాం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరాహ్ స్పందించాడు. మహాభారతంలో లవ్ జీహాద్ జరిగిదంటూ సంచలన ఆరోపణలు చేశాడు. ఇక దీనిపై స్పందించిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత భిశ్వ శర్మ ఘాటు విమర్శలు చేశాడు. సనాతన ధర్మం, హిందూ ధర్మాలకు వ్యతిరేకంగా బోరాహ్ మాట్లాడారని అగ్రహం వ్యక్తం చేశాడు. రుక్మిణి దేవిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు, అర్జునుడు ఓ యువతి రూపంలో వచ్చినప్పుడు లవ్ జీహాద్ జరిగిందని భూపేన్ బోరాహ్ పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవిల అంశాన్ని లేవనెత్తడం సనాతన ధర్మానికి విరుద్ధమని హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా ఖండించారు.
నేరపూరిత చర్యలను దేవుడి చర్యలతో పోల్చరాదు
హజ్రత్ మహమ్మద్‌ను, జీసస్ క్రీస్తును వివాదాల్లో లాగమని, అదే విధంగా శ్రీకృష్ణుడిని వివాదాల్లోకి లాగడం మానుకోవాలని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. నేరపూరిత చర్యలను దేవుడి చర్యలతో పోల్చడం సరికాదన్నారు. రుక్మిణి దేవిని మతం మార్చుకోవాలని శ్రీకృష్ణుడు ఎన్నడూ నిర్బంధించలేదని, మాయ మాటలు చెప్పి యువతిని పెళ్లి చేసుకొని మతం మార్చడమే లవ్ జిహాద్ అని చెప్పారు. హిందువులు హిందువులను, ముస్లిములు, ముస్లిములను పెళ్లి చేసుకుంటే సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మతాంతర వివాహాలు జరగాలన్నారు.
తప్పుడు గుర్తింపుతో మహిళను పెళ్లి చేసుకొని మతం మార్చడమే లవ్ జిహాద్
కాంగ్రెస్ నేత భూపేన్ బోరాహ్ చేసిన వ్యాఖ్యలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అరెస్టు చేయాల్సి ఉంటుందని, వేలాది మంది సనాతన మతస్థులు ఫిర్యాదులు చేస్తే తాను కూడా ఆయనను కాపాడలేనని సీఎం వ్యాఖ్యనించారు. రుక్మిణిని మతం మార్చుకోవాలని శ్రీకృష్ణుడు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదన్నారు. తప్పుడు గుర్తింపుతో బాలికను పెండ్లి చేసుకొని ఆపై బలవంతగా ఆమెను మతం మార్చడం లవ్ జిహాద్ కిందకు వస్తుందన్నారు.