Bomb Threat: బాంబు బెదిరింపులతో కేరళ ముఖ్యమంత్రి నివాసం,ప్రైవేట్ బ్యాంకులో తనిఖీలు.. అప్రమత్తమైన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు కలకలం రేపుతున్న వేళ, తాజాగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను లక్ష్యంగా చేసుకుని మరో బెదిరింపు వచ్చింది. సీఎం అధికారిక నివాసం, తిరువనంతపురంలోని ఓ ప్రైవేట్ బ్యాంకు కార్యాలయం, అలాగే సీఎం వ్యక్తిగత కార్యదర్శికి కూడా బాంబులు పెట్టినట్లు ఆగంతకులు ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపించారు. ఈ హెచ్చరికలతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ల సాయంతో ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బెదిరింపులు పంపిన వ్యక్తుల గాలింపునకు దర్యాప్తు ప్రారంభించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కేరళ సీఎంకు బాంబు బెదిరింపులు
STORY | Hoax bomb threat triggers checks at Kerala CM''s residence, pvt bank
— Press Trust of India (@PTI_News) December 1, 2025
Checks were carried out at Kerala Chief Minister Pinarayi Vijayan's official residence and at a private bank in Palayam here on Monday after an email claimed that bombs were placed at both locations,… pic.twitter.com/6L5EmA7ig1