Page Loader
Tirupati: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు.. అపప్రమత్తమైన పోలీసులు 
తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు.. అపప్రమత్తమైన పోలీసులు

Tirupati: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరింపులు.. అపప్రమత్తమైన పోలీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 25, 2024
12:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతిలోని పలు ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడం గందరగోళం సృష్టించింది. లీలామహాల్ సమీపంలో ఉన్న మూడు ప్రైవేటు హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు గురువారం మెయిల్ ద్వారా బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. డీఎస్పీ వెంకట నారాయణ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక బృందాలతో పరిశీలనలు నిర్వహించారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అలిపిరి, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లలో ఈ బెదిరింపు మెయిల్స్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వివరాలు 

స్టార్ ఎయిర్ లైన్స్‌కి కూడా బాంబు బెదిరింపులు

ఈ ఘటనకు ముందు,తమిళనాడులో ఒక కేసులో ఉగ్రవాది జాఫర్ సాదిక్‌కి కోర్టు జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో,సీఎం కుటుంబంతో పాటు పాఠశాలలపై కూడా ఐఎస్ఐ పేలుళ్లకు కుట్ర పన్నుతోందని,తిరుపతిలోని పలు హోటళ్లను కూడా పేల్చేస్తామని హెచ్చరించడంతో హోటల్ యజమానులు అప్రమత్తమయ్యారు. ఇంకా,తిరుపతి విమానాశ్రయంలోని స్టార్ ఎయిర్ లైన్స్‌కి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. స్టార్ ఎయిర్ లైన్స్‌కి చెందిన ఎస్ 5-154 ఫ్లైట్‌కి సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు సందేశాలు వెలువడ్డాయి. 'అదామ్ నాన్‌జా 333' అనే ఎక్స్ అకౌంట్ నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో పలు విమానసేవలకు ఫేక్ బాంబు బెదిరింపులు రావడం అధికారులకు తీవ్ర సవాలుగా మారింది.