Page Loader
Amitshah: రేపు ఏపీలో అమిత్ షా టూర్.. చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరు
రేపు ఏపీలో అమిత్ షా టూర్.. చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరు

Amitshah: రేపు ఏపీలో అమిత్ షా టూర్.. చంద్రబాబు ఇంట్లో విందుకు హాజరు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 17, 2025
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం, ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో అమిత్ షా కోసం ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో ఆయన పాల్గొంటారు. తర్వాత, విజయవాడలోని హోటల్‌కు చేరుకుని అక్కడ బస చేస్తారు. ఆదివారం, గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎన్ఐడీఎం (NIDM) ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభిస్తారు.

వివరాలు 

అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు 

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు ప్రజాప్రతినిధులు హాజరవుతారు. ప్రారంభోత్సవం అనంతరం అమిత్ షా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లకు పోలీసులు భారీగా సిద్ధమయ్యారు. ఇప్పటికే గన్నవరం నుండి ఉండవల్లి వరకు ట్రయల్ రన్ నిర్వహించారు.