
MP: ఆస్పత్రిలో వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన సిబ్బంది.. వైద్యులపై సస్సెన్షన్ వేటు
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో మానవత్వాన్ని మరిచే ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
ఓ వృద్ధుడిని ఆస్పత్రి సిబ్బంది అసభ్యంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుండటంతో అధికార యంత్రాంగం స్పందించి కఠిన చర్యలు తీసుకుంది.
ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు వైద్యులను ప్రభుత్వం సస్పెండ్ చేయగా, మరొకరిని తొలగించాలని సిఫార్సు చేసింది.
Details
ఏప్రిల్ 17న జరిగిన ఘటన
నౌగావ్ పట్టణానికి చెందిన ఉద్ధవ్ సింగ్ జోషి (వయసు 77) తన భార్యకు వైద్య పరీక్షలు చేయించేందుకు ఛతర్‌పూర్ జిల్లా ఆస్పత్రికి వచ్చారు.
అయితే అక్కడ ఓ దారుణం చోటుచేసుకుంది.
ఆస్పత్రిలో టైమ్ స్లాట్ స్లిప్ తీసుకుని పెద్దగా క్యూలో నిలిచిన జోషి, తన వంతు వచ్చినప్పుడు డాక్టర్ రాజేష్ మిశ్రా నిరాకరించడమే కాకుండా చెంపదెబ్బ కూడా కొట్టాడని జోషి ఆరోపించారు.
సివిల్ సర్జన్ జీఎల్ అహిర్వర్ ప్రకారం, అప్పటికే ఆస్పత్రిలో భారీ రద్దీ ఉండటంతో క్యూలో నిలబడటం గురించి డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశాడని తెలిపారు.
Details
అధికారులపై చర్యలు
వృద్ధుడిని ఇద్దరు వ్యక్తులు అమానుషంగా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో, ఈ ఘటనపై అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ ఘటనలో డాక్టర్ రాజేష్ మిశ్రాను వైద్య సేవల నుంచి తొలగించగా, సివిల్ సర్జన్ అహిర్వర్‌ను సస్పెండ్ చేశారు.
ఆయనపై ఆరోపణలు ఏమిటంటే సిబ్బందిపై నియంత్రణ లేకపోవడం, కలెక్టర్ ఆదేశించిన నివేదికను సమర్పించకపోవడం, షోకాజ్ నోటీసుకు స్పందించకపోవడం వంటివి.
ఇక రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీకి చెందిన ఉద్యోగి రాజేంద్ర ఖరేను కూడా తొలగించాల్సిందిగా జిల్లా కలెక్టర్ పార్థ్ జైస్వాల్ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
Details
క్రిమినల్ కేసు నమోదు
ఇక ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు కూడా మొదలయ్యాయి. నౌగావ్ పోలీస్ స్టేషన్‌లో డాక్టర్ మిశ్రాపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 115(2), 296, 3(5), మరియు 351(3) కింద 'జీరో ఎఫ్‌ఐఆర్' నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అతనిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తర్వాత ఛతర్‌పూర్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేసినట్లు సమాచారం.
ఈ అమానుష ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వృద్ధుల పట్ల ఆస్పత్రుల్లో కనికరంగా ఉండాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రోగిపై వైద్యుల అమానుష ప్రవర్తన
• 75 साल के बुजुर्ग को #छतरपुर जिला अस्पताल के डॉक्टर्स और अस्पताल स्टाफ द्वारा न सिर्फ लात-घूंसे मारे गए, बल्कि बेरहमी से घसीटकर अस्पताल से बाहर फेंक दिया गया!
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) April 20, 2025
• पत्नी के इलाज के लिए आए बुजुर्ग का कसूर सिर्फ इतना था कि वे लंबी लाइन में लंबे वक्त तक खड़े नहीं हो पा रहे थे,… pic.twitter.com/VAB1MeMb1s