NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు 
    తదుపరి వార్తా కథనం
    Delhi: మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు 
    మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు

    Delhi: మహిళపై వ్యక్తి అత్యాచారం,ఆమెపై 'వేడి పప్పు'పోసి, చిత్రహింసలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 07, 2024
    09:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు చెందిన ఓ మహిళపై న్యూదిల్లీలో ఆమె స్నేహితుడు వారం రోజుల పాటు అత్యాచారం చేసి, ఆమెను చిత్రహింసలకు గురిచేసి తీవ్ర గాయాలపాలు చేశాడు.

    నిందితుడు మహిళపై "వేడి పప్పు" కూడా పోసేవాడని పోలీసులు మంగళవారం చెప్పారు.

    28 ఏళ్ల నిందితుడు, పరాస్‌ను అరెస్టు చేసి, అత్యాచారం, సోడోమీ,హాని కలిగించినందుకు అతని పై అభియోగాలు మోపారు.

    మహిళ శరీరంపై దాదాపు 20 గాయాల గుర్తులు ఉన్నాయి. ఆమె ఆసుపత్రి పాలైంది. ఆమె ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయినట్లు అధికారులు తెలిపారు.

    Details 

    ఫోన్ కాల్ చేసిన వెంటనే మహిళను రక్షించిన పోలీసులు 

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆ మహిళ పరాస్‌తో కలిసి దక్షిణ ఢిల్లీలోని నెబ్ సరాయ్ ప్రాంతంలో అద్దెకు తీసుకున్న ఇంట్లో సుమారు నెల రోజులుగా నివసిస్తోంది.

    ఆ మహిళ గత 3-4 నెలలుగా పరాస్‌తో స్నేహాన్ని పెంచుకుంది. జనవరి 30న, నెబ్ సరాయ్ పోలీస్ స్టేషన్‌కు ఒక మహిళ కాల్ చేసి తన స్నేహితుడు తనపై దాడి చేశాడని తెలిపింది.

    ఈ విషయమై వేగంగా స్పందించిన పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుని మహిళను రక్షించి, వైద్య సహాయం కోసం వెంటనే ఎయిమ్స్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని ఫిబ్రవరి 2న అరెస్టు చేశారు.

    Details 

    బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు 

    మహిళ వాంగ్మూలం ప్రకారం, ఆమె జనవరి ప్రారంభంలో ఓ ఇంట్లో పని మనిషిగా ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్లడానికి సిద్ధమైంది.

    అంతకంటేముందు, ఆ ఉద్యోగాన్ని ఇప్పించడంలో సహాయం అందించిన పరాస్‌ను కలవడానికి ఆమె ఢిల్లీకి వెళ్లడంతో అతను ఆమెను ఢిల్లీలోనే ఉండమని కోరినట్లు వార్తా సంస్థ PTI నివేదించింది.

    అనంతరం,పరాస్ ఆమెను ఒక వారం పాటు శారీరక వేధింపులకు,లైంగిక వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఆమెపై వేడి పప్పు పోయటంతో,ఆమెకు గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు.

    బాధితురాలి ఫిర్యాదుపై, భారతీయ శిక్షాస్మృతిలోని 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 376 (అత్యాచారం) 377 (సోడమీ) సెక్షన్ల కింద జనవరి 30న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు .దీనిపై విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    అత్యాచారం

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    దిల్లీ

    WhatsApp-bus ticket: వాట్సాప్‌లోనే బస్సు టికెట్ల బుకింగ్.. ప్రభుత్వం సన్నాహాలు  ప్రభుత్వం
    Parliament security breach: పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు.. 'సీన్‌ రీక్రియేషన్‌'కు ప్లాన్‌..!  భారతదేశం
    Delhi Fog : దిల్లీలో చలిపంజా.. బెంబెలెత్తుతున్న రాజధాని వాసులు.. తమిళనాడుకు భారీ వర్ష సూచన భారతదేశం
    Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసు.. ఆరో నిందితుడు అరెస్ట్ పార్లమెంట్

    అత్యాచారం

    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్
    స్వామీజీ పూర్ణానంద అర్ధరాత్రి అరెస్ట్.. రెండేళ్లుగా బాలికపై అత్యాచారం విశాఖపట్టణం
    భార్యకు డ్రగ్స్ ఇచ్చి 51మందితో అత్యాచారం చేయించిన భర్త; వీడియోలు కూడా తీశాడట  ఫ్రాన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025