Telangana: తెలంగాణలో ఒక్కసారిగా వేడి వాతావరణం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన గాలిలో తేమ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో గురువారం పగటిపూట వేడి ఒక్కసారిగా పెరిగింది. ఉదయం 11 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగడం ప్రారంభమైంది.
అనేక ప్రాంతాల్లో గాలిలో తేమ స్థాయి కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
మహబూబ్‌నగర్‌లో గాలిలో తేమ శాతం 21గా, ఆదిలాబాద్‌లో 25, రామగుండంలో 30, హైదరాబాద్, భద్రాచలంలో 35, నల్గొండ, ఖమ్మంలలో 36, నిజామాబాద్‌లో 39గా నమోదైంది.
సాధారణంగా గాలిలో తేమ 50 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది.
అయితే, మధ్య భారతదేశం నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని నిపుణులు వెల్లడించారు.
వివరాలు
హైదరాబాద్‌లో 35.2 డిగ్రీల సెల్సియస్
పగటిపూట మహబూబ్‌నగర్‌లో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికంటే 4.3 డిగ్రీల మేర పెరిగి 37.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
భద్రాచలంలో 3.7 డిగ్రీలు పెరిగి 36.8, ఖమ్మంలో 5.3 డిగ్రీలు పెరిగి 36.6, హైదరాబాద్‌లో 3.6 డిగ్రీలు పెరిగి 35.2 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డైంది.