
ఆంధ్రప్రదేశ్‌లోని 116 మండలాల్లో వేడిగాలులు; అమసరమైతే బయటకు రావాలని ఐఎండీ సూచన
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది.
ఐఎండీ అంచనాల ప్రకారం సోమవారం 116 మండలాల్లో, మంగళవారం 61 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.
అల్లూరి జిల్లాలో 7, అనకాపల్లి 15, తూర్పుగోదావరి 8, ఏలూరు, గుంటూరు 6, కాకినాడ 9, కృష్ణా 6, నంద్యాల 4, ఎన్టీఆర్ 15, పల్నాడు 2, పార్వతీపురం మన్యం 10. శ్రీకాకుళం 3, విశాఖపట్నం 1, విజయనగరం 13, వైఎస్ఆర్ జిల్లాలో 13 మండలాలల్లో వేడి గాలులు వీస్తాయని చెప్పింది.
ఎండలు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తు నిర్వహణ సంస్థ
అనకాపల్లి 11, కాకినాడ 3, విజయ్‌నగరం మండలాలతో పాటు 100 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
మరోవైపు ఏపీ అంతటా పొడి వాతావరణం కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఉత్తర కోస్తా ఆంధ్ర, రాయలసీమ, దక్షిణ కోస్తాలో కూడా ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ బులెటిన్‌లో పేర్కొంది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు సూచించారు.