Page Loader
ఓటర్లకు బంపర్ ఆఫర్.. ఓటేసొస్తే ఉచితంగా పోహా, జిలేబీ
ఓటేసొస్తే ఉచితంగా పోహా, జిలేబీ

ఓటర్లకు బంపర్ ఆఫర్.. ఓటేసొస్తే ఉచితంగా పోహా, జిలేబీ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Oct 14, 2023
06:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండోర్ ఓటర్లకు బంపర్ ఆఫర్ తగిలింది. ఈ మేరకు నగరంలోని దుకాణదారుల సంఘం ఈ ఆఫర్‌ ప్రకటించింది. అయితే ఉదయం 9 గంటలలోగా ముందుగా ఓటేసి వచ్చిన వారికి ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని చెప్పింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు రకరకాల తాయిలాలు ప్రకటించడం కొన్నేళ్లుగా జరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఓ దుకాణదారుల సంఘం పోహా, జిలేబీ అంటూ ముందుకొచ్చింది. రాష్ట్రంలోని 230 స్థానాలకు నవంబర్‌ 17న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కాంగ్రెస్‌, అధికార బీజేపీ మధ్య టగ్ ఆఫ్ వార్ జరగనుంది. ఈ క్రమంలోనే ఇండోర్‌లోని ఫుడ్‌ హబ్‌ '56 దుకాణ్‌' యజమానులు భారీ ఆఫర్‌ను ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మధ్యప్రదేశ్‌లోని '56 దుకాణ్' సంఘం ప్రకటన