
Lawrence Bishnoi: 'జైల్లో ఉండి హత్య ఎలా చేస్తాను'? .. లారెన్స్ బిష్ణోయ్ ఆగ్రహం
ఈ వార్తాకథనం ఏంటి
పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తనపై కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ కుట్రలో పోలీసులు కూడా భాగస్వాములుగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జోధ్‌పూర్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన లారెన్స్, తనతో పాటు తన సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌ను కూడా అబద్ధపు కేసుల్లో ఇరికిస్తున్నారని చెప్పారు.
నేను జైలులో ఉంటూ ఒకరిని ఎలా బెదిరిస్తాను? ఒకరిని ఎలా చంపుతాను? జైల్లో మొబైల్ ఫోన్లు కూడా లేవు.
అలాంటప్పుడు నాపై వచ్చే ఆరోపణలు ఎలా నిజమవుతాయి? నా పేరును వాడుకుంటూ కుట్ర చేస్తున్నారు," అని లారెన్స్ వ్యాఖ్యానించారు.
Details
సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ అరెస్టు
2022లో సిద్ధూ మూసేవాలా హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ పేరు ప్రధానంగా వినిపించింది. ఆ కేసులో పంజాబ్ పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు.
ఏ కేటగిరీ గ్యాంగ్‌స్టర్‌గా గుర్తింపుతెచ్చుకున్న లారెన్స్‌పై ఆ తరువాత పలు తీవ్ర ఆరోపణలు వచ్చాయి.
సిద్ధూ హత్య తర్వాత, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు బెదిరింపులు కూడా లారెన్స్ పనేనని ఆరోపణలొచ్చాయి.
గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ 2022లో కచ్‌లో పాకిస్తానీ ఓడ నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న సందర్భంలో లారెన్స్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.
ఆ డ్రగ్స్ ఆర్డర్ చేయడంలో లారెన్స్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.
Details
నాలుగు కేసుల్లో దోషిగా లారెన్స్
గుజరాత్ పోలీసులు 2023 ఆగస్టు 23న లారెన్స్‌ను దిల్లీ జైలు నుంచి సబర్మతి జైలుకు తరలించారు.
అప్పటి నుంచి ఆయన్ను వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరుస్తున్నారు.
సెక్షన్ 268 (1) ప్రకారం ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు తగ్గిపోయాయి. పంజాబ్, దిల్లీ, రాజస్థాన్‌లలో లారెన్స్ బిష్ణోయ్‌పై పలు కేసులు నమోదయ్యాయి.
వీటిలో నాలుగు కేసుల్లో ఆయన దోషిగా తేలినట్లు పోలీసులు చెబుతున్నారు.