Page Loader
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది? 
ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది?

ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులు ఎలా ఉన్నారు? కేంద్రం ఏం చెబుతోంది? 

వ్రాసిన వారు Stalin
Oct 09, 2023
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పాలస్తీనాకు చెందిన హమాస్‌ గ్రూప్.. ఇజ్రాయెల్‌పై రాకెట్ల వర్షం కురిపిస్తోంది. ఉద్రిక్తతల నేపత్యంలో లక్షల మంది భారతీయులు ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయారు. ఇజ్రాయెల్‌లో భారతీయులు సురక్షితంగా ఉన్నారా? వారు ఎక్కడ తలదాచుకుంటున్నారు? కేంద్రం ప్రభుత్వం ఏం చెబుతోంది.? హమాస్ మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకుపోయిన భారతీయుల పరిస్థితిని ప్రధాని కార్యాలయం పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. ఇజ్రాయెల్‌లో సుమారు 18,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులు పెద్ద సంఖ్యలో వృద్ధులను సంరక్షకులుగా పనిచేస్తున్నారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులు, ఐటీ నిపుణులు ఉంటారు. వజ్రాల వ్యాపారులు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్‌లో దాదాపు 85,000మంది భారతీయ సంతతికి చెందిన యూదులు నివసిస్తున్నారని ఎన్డీటీవీ నివేదిక చెబుతోంది.

హమాస్

1950లో ప్రారంభమైన ఇజ్రాయెల్‌కు వలసలు

ఇజ్రాయెల్‌కు భారతీయుల వలసలు 1950, 1960లలో ప్రారంభమైనట్లు నివేదికలు చెబుతున్నాయి. మిజోరాం, మణిపూర్‌లోని యూదులు భారీ సంఖ్యలో ఇజ్రాయెల్‌కు వలస వచ్చారు. ఇజ్రాయెల్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న తీరప్రాంత నగరమైన అష్కెలోన్‌లో శనివారం జరిగిన క్షిపణి దాడిలో కేరళకు చెందిన షీజా ఆనంద్ అనే మహిళ గాయపడ్డారు. హిబ్రూ యూనివర్శిటీలో డాక్టరేట్ చదవుతున్న బిందు మాట్లాడుతూ.. భారతీయులందరూ పరస్పరం టచ్‌లో ఉన్నారని చెప్పారు. హిమాస్ మిలిటెంట్ల దాడి నేపథ్యంలో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారినట్లు మరో విద్యార్థి వికాస్ శర్మ పేర్కొన్నారు. చాలా మంది విద్యార్థులు విద్యాసంస్థలు అందించిన వసతి గృహాల్లో ఉంటున్నారని ఆయన పేర్కొన్నారు. వాట్సాప్ ద్వారా భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.

భారత్

వీధుల్లో బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న హమాస్ మిలిటెంట్లు

అత్యంత సున్నిత ప్రాంతమైన అష్కెలోన్‌లో నివసిస్తున్న ఎల్లే ప్రసాద్ మాట్లాడుతూ.. పరిస్థితులు భయకరంగా ఉందన్నారు. తాము ప్రత్యేక్షంగా క్షిపణి దాడులను చూస్తున్నట్లు ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌కు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న కేరళకు చెందిన జిబి యోహన్నన్ పేర్కొన్నారు. హిమాస్ మిలిటెంట్లు వాహనాల్లో వచ్చి వీధుల్లోని పౌరులపై బుల్లెట్ల వర్షం కురపిస్తున్నారని యోహన్నన్ తెలిపారు. టెల్ అవీవ్‌లోని భారతీయులు తిరిగి స్వదేశానికి రావడానికి ఇండియన్ ఎంబసీ అభ్యర్థనలను స్వీకరించింది. ఇదే సమయంలో కొంతమంది వ్యాపారవేత్తలు కూడా ఇజ్రాయెల్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని వీలైనంత త్వరగా భారత్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

భారత్

భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు: విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి 

24 గంటలూ భారతీయ పౌరులందరికీ అందుబాటులో ఉంటామని వారికి మార్గనిర్దేశం చేస్తున్నామని ఇండియన ఎంబసీ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ పౌరులను ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని ఇజ్రాయెల్‌, పాలస్తీనాలోని రాయబార కార్యాలయాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే, భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయంలో, కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో భారత్ తన పౌరులను విదేశాల నుంచి విజయవంతంగా తరలించిందని ఆమె తెలిపారు. ఇప్పటికే ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న బాలీవుడ్ నటి నుష్రత్ భరుచ్చాను సురక్షితంగా ఇండియాకు తరలించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 28నుంచి అక్టోబర్ 7వరకు జరిగిన హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఆమె ఇజ్రాయెల్ వెళ్లారు.