Page Loader
How refusal to eat : పురుష నాళంలో బంగారు ముద్ద.. విమానంలో ఢిల్లీకి నిందితుడు
How refusal to eat : పురుష నాళంలో బంగారు ముద్ద.. విమానంలో ఢిల్లీకి నిందితుడు

How refusal to eat : పురుష నాళంలో బంగారు ముద్ద.. విమానంలో ఢిల్లీకి నిందితుడు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2024
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI 992 జెడ్డా నుండి ఢిల్లీకి వచ్చిన ఒక ప్రయాణికుడిని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయానికి చేరుకోగానే అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ హోస్టెస్ ఏమి ఇచ్చినా వద్దన్నాడు రొటీన్ సర్వీస్ చేస్తున్న ఒక ఎయిర్ హోస్టెస్, ఐదున్నర గంటల ఫ్లైట్ సమయంలో అందించిన అన్ని రిఫ్రెష్‌మెంట్లను ప్రయాణీకుడు తిరస్కరించడాన్ని గమనించింది. నీరు, టీ , ఆహారం ఏమి ఇచ్చినా వద్దన్నాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ ఫ్లైట్ కెప్టెన్‌ను అప్రమత్తం చేసింది. ప్రయాణీకునితో ఏదో సమస్య వుందని గుర్తించి, కెప్టెన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. అది తదనంతరం భద్రతా ఏజెన్సీలకు తెలియజేసినట్లు న్యూస్18లోని ఒక కధనం తెలిపింది.

#1

ప్రయాణికుడి పై నిఘా 

విమానం రాగానే, కస్టమ్స్ ప్రివెంటివ్ టీమ్ ప్రయాణికుడిపై నిఘా ఉంచింది. అతను కస్టమ్స్ అధికారుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. వెంటనే స్పందించిన అధికారులు అతన్ని అడ్డుకున్నారు. విచారణ చేశారు. ఈ క్రమంలోనే ఆ ప్రయాణికుడు తన పురీషనాళంలో బంగారు ముద్దను దాచుకున్నట్లు అంగీకరించాడు. నాలుగు ఓవల్ క్యాప్సూల్స్ రూపంలో వున్న నిషిద్ధాన్ని సేకరించారు. సిబ్బందికి నిశితంగా శిక్షణ. జాయింట్ కమీషనర్ (కస్టమ్స్) మోనికా యాదవ్ సుమారు 1,096.76 గ్రాముల బంగారం రికవరీ చేసుకున్నామని ధృవీకరించారు

#2

దీని విలువ దాదాపు రూ.69,16,169. 

ప్రయాణీకుడు జెడ్డా నుండి బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు అంగీకరించాడు. కస్టమ్స్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అతన్ని అరెస్టు చేశారు.ప్రయాణీకుల ప్రవర్తనను నిశితంగా పర్యవేక్షించడానికి విమాన సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా ఆహారం లేదా పానీయాలు తీసుకోవడం మానుకునే వారు. ఇది అక్రమ రవాణా ప్రయత్నాలకు సంకేతంగా ఉంటుంది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలను గుర్తించడంలో నిరోధించడంలో ఎయిర్‌లైన్స్ సెక్యూరిటీ ఏజెన్సీల మధ్య సహకారం చాలా కీలకం. ఎయిరిండియా విమాన సిబ్బంది ప్రదర్శించిన అప్రమత్తతకు తోడు కస్టమ్స్ అధికారుల తదుపరి వేగవంతమైన చర్యలకు దిగి స్మగ్లింగ్ కార్యకలాపాలను అరికట్టారు.