Page Loader
'Talliki Vandanam': తల్లికి వందనం' స్కీమ్ అప్డేట్ .. 'వాట్సాప్‌' ద్వారా స్టేటస్‌ ఎలా తెలుసుకోవచ్చంటే..
తల్లికి వందనం' స్కీమ్ అప్డేట్ .. 'వాట్సాప్‌' ద్వారా స్టేటస్‌ ఎలా తెలుసుకోవచ్చంటే..

'Talliki Vandanam': తల్లికి వందనం' స్కీమ్ అప్డేట్ .. 'వాట్సాప్‌' ద్వారా స్టేటస్‌ ఎలా తెలుసుకోవచ్చంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 14, 2025
11:19 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకం కింద నిధుల జమ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా మొత్తం రూ. 15,000 మంజూరు చేస్తుండగా,అందులో రూ. 13,000 నేరుగా తల్లి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. మిగిలిన రూ. 2,000 ను విద్యాసంస్థల అభివృద్ధి, నిర్వహణ కోసం సంబంధిత జిల్లా కలెక్టర్ ఖాతాలోకి బదిలీ చేస్తారు. ఈ డబ్బులు ఖాతాలోకి వచ్చాయా లేదా అనేదాన్ని మనమిత్ర వాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం 'తల్లికి వందనం' పథకాన్ని అధికారికంగా ప్రారంభించింది. గురువారం నుంచి ఈ పథకం అమలులోకి వచ్చిందని ప్రభుత్వం వెల్లడించింది.కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది.

వివరాలు 

స్కూళ్ల అభివృద్ధి కోసం రూ.2,000

ఈ పథకం కింద ప్రథమ తరగతి నుంచి 12వతరగతి వరకు చదువుతున్న పిల్లల తల్లులకు రూ. 13,000 నేరుగా ఆర్థిక సాయం అందిస్తారు. అదనంగా స్కూళ్ల అభివృద్ధి కోసం రూ.2,000 కేటాయిస్తారు.ఇక ఈ పథకానికి సంబంధించిన సమాచారం,స్టేటస్‌ను తెలుసుకునేందుకు'మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్' అనే విధానం అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా స్టేటస్‌ తెలుసుకోవాలంటే ముందు 9552300009 అనే నంబర్‌కు వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. అనంతరం సేవల ఎంపికను సెలెక్ట్‌ చేయాలి.దాంతో ప్రభుత్వ సేవల విభాగం తెరుచుకుంటుంది. అందులో 'తల్లికి వందనం'అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.ఆతర్వాత స్టేటస్‌ చెక్‌ చేసే విభాగంలో తల్లి ఆధార్ నెంబర్ నమోదు చేసి సబ్మిట్ చేయాలి. తద్వారా డబ్బులు ఖాతాలో జమయ్యాయా లేదా అనేది తెలుసుకోవచ్చు.

వివరాలు 

ప్రత్యేక వెబ్‌లింక్‌ ద్వారా కూడా స్టేటస్‌ చెక్ చేసుకోవచ్చు

వాట్సాప్‌ ద్వారా కాకుండా ప్రత్యేక వెబ్‌లింక్‌ ద్వారా కూడా స్టేటస్‌ చెక్ చేసుకోవచ్చు. అందుకోసం ఈ లింక్‌ ను ఓపెన్ చేయాలి.అక్కడ స్కీమ్ విభాగంలో 'తల్లికి వందనం' పథకాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత సంవత్సరాన్ని 2025-2026 గా సెలెక్ట్‌ చేయాలి. తల్లి ఆధార్ నెంబర్‌ను నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత Get OTP బటన్‌పై క్లిక్ చేస్తే, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసి Submit చేస్తే, అప్లికేషన్ స్టేటస్‌ తెలుసుకోవచ్చు.

వివరాలు 

ర్హులైన తల్లుల జాబితాను జూన్ 30 విడుదల

ఇక మరోవైపు గ్రామ/వార్డు సచివాలయాల్లో 'తల్లికి వందనం' పథకానికి అర్హుల జాబితా, అనర్హుల జాబితాను ప్రదర్శిస్తున్నారు. ఈ జాబితాలపై ఎవరైనా అభ్యంతరాలు తెలపదలిస్తే, జూన్ 20వ తేదీ లోగా ఫిర్యాదులు చేయవచ్చు. ఈ ఫిర్యాదులపై పునఃపరిశీలన జరుగుతుంది. అర్హత కలిగిన వారిని గుర్తించి, మరోసారి జాబితాను సిద్ధం చేస్తారు. ఈ ప్రక్రియను జూన్ 21 నుంచి 28 తేదీల మధ్య పూర్తి చేస్తారు. గ్రీవెన్స్ పర్యవేక్షణ పూర్తయిన తర్వాత, అర్హులైన తల్లుల జాబితాను జూన్ 30న విడుదల చేస్తారు. వీరికి జూలై 5వ తేదీన నిధులను వారి ఖాతాల్లో జమ చేస్తారు.