Page Loader
Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ 
'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ

Adani & Ambani: 'దేశ సాయుధ బలగాలకు అండగా ఉంటాం'.. అదానీ, అంబానీ 

వ్రాసిన వారు Sirish Praharaju
May 09, 2025
02:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ స్పందించారు. దేశానికి అవసరమయ్యే ఏవైనా సహాయాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వారు ప్రకటించారు. పాకిస్తాన్‌పై విజయాన్ని సాధించి భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పాక్‌తో యుద్ధ స్థితిలో భారత్‌కు తాము సంపూర్ణ మద్దతుగా నిలుస్తామని వారు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని వారు తమ తమ సోషల్ మీడియా వేదికల ద్వారా తెలియజేశారు. భారత్‌-పాక్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో భారతీయుల ఐక్యత, నిజమైన శక్తి ఈ సమయంలో ఉబికి వచ్చేస్తుందని గౌతమ్ అదానీ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

వివరాలు 

 రిలయన్స్ కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధం

దేశ సాయుధ దళాలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, దేశ ప్రజలకు అవసరమైన అన్ని విధాలా సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు. ఇదే విధంగా, ముఖేష్ అంబానీ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, దేశానికి అన్ని విధాలుగా మద్దతుగా నిలవడానికి రిలయన్స్ కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గౌతమ్ అదానీ చేసిన ట్వీట్