
Hyderabad Drug: హైదరాబాద్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. రూ.12 వేల కోట్ల మాదకద్రవ్యాలు సీజ్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో భారీ స్థాయిలో నడుస్తున్న డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు బట్టబయలు చేశారు. మేడ్చల్‌లోని ఓ ఫ్యాక్టరీపై దాడులు నిర్వహించిన అధికారులు, సుమారు 12 వేల కోట్ల రూపాయల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఎండీ డ్రగ్స్ కంపెనీపై విస్తృత సోదాలు చేసి, అక్కడ భారీ స్థాయిలో తయారవుతున్న మూడు రకాల మాదకద్రవ్యాలను సీజ్ చేశారు.
Details
13 మంది అరెస్టు
వీటిలో అత్యంత ప్రమాదకరమైన ఎక్స్‌టీసీ (XTC), మోలీ, MDMA డ్రగ్స్ లభించాయి. అదేవిధంగా, సుమారు 32,000 లీటర్ల రా మెటీరియల్‌ను కూడా పోలీసులు హస్తగతం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో డ్రగ్స్ తయారీకి సంబంధించి ఉన్న 13 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. మహారాష్ట్ర పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో ముంబై క్రైమ్ బ్రాంచ్ ఈ స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. కాగా, హైదరాబాద్‌లో తయారు చేస్తున్న ఈ డ్రగ్స్‌ను దేశ విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది.