Page Loader
Madanapalle: స్పిన్ గిఫ్ట్' పేరుతో భారీ మోసం.. 6 వేల మందిని లక్ష్యంగా వసూళ్లు చేసిన ఆరా సంస్థ
స్పిన్ గిఫ్ట్' పేరుతో భారీ మోసం.. 6 వేల మందిని లక్ష్యంగా వసూళ్లు చేసిన ఆరా సంస్థ

Madanapalle: స్పిన్ గిఫ్ట్' పేరుతో భారీ మోసం.. 6 వేల మందిని లక్ష్యంగా వసూళ్లు చేసిన ఆరా సంస్థ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 23, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గొలుసుకట్టు మోసం తరహాలో ఒక భారీ మోసం బయటపడింది. 'స్పిన్ గిఫ్ట్' అనే పేరుతో ప్రచారం నిర్వహించిన ఆరా సంస్థ, బహుమతులు,నగదు రూపంలో లాభాలు వస్తాయని నమ్మించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మదనపల్లెలో సుమారు 6 వేల మందిని లక్ష్యంగా చేసుకుని వేలల్లో రూపాయలు వసూలు చేసినట్టు బాధితులు వెల్లడిస్తున్నారు. ఆ సంస్థకు మదనపల్లెకు చెందిన మోహన్‌బాబు నాయకత్వం వహిస్తున్నాడు. అతను లాప్‌టాప్‌లు,స్మార్ట్‌ఫోన్లు, కార్లు, టూవీలర్లు వంటివి గిఫ్ట్‌లుగా లభిస్తాయని చెప్పి ప్రజల నుంచి డబ్బు వసూలు చేశాడు.

వివరాలు 

రోజువారి ఆదాయం

కంపెనీ ప్రతినిధులు రూ.2,000, రూ.5,400, రూ.20,000 వంటి రకాలుగా ఇన్వెస్ట్ చేస్తే, రోజువారి ఆదాయం వస్తుందని నమ్మబలికారు. ప్రారంభంలో కొంతమందికి గిఫ్ట్‌లు ఇవ్వడంతో ప్రజలు ఈ స్కీమ్‌ నిజమేనని నమ్మారు. అయితే కొద్ది రోజులకే అసలు రూపం బయటపడింది. కొంతమందికి గిఫ్ట్‌లు ఇచ్చిన తర్వాత మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మోసానికి గూరైనవారి సంఖ్య జిల్లాలో ఎక్కువగా ఉందని సమాచారం. బాధితులు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారు తమ కష్టార్జితాన్ని కోల్పోయామని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని, పోలీసులను వేడుకుంటున్నారు.