
ట్యాక్స్ రీఫండ్ పేరిట ప్రభుత్వ ఉద్యోగులకు ఎర.. భారీ కుంభకోణాన్ని చేధించిన హైదరాబాద్ ఐటీ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో భారీ ఐటీ రీఫండ్ కుంభకోణాన్ని ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేధించారు. ఫేక్ డాక్యుమెంట్లతో రీఫండ్ స్కామ్ చేస్తున్నారని వెల్లడించింది.
మొత్తం 8 మంది రూ. 40 కోట్ల భారీ ఆర్థిక కుట్రలో భాగమయ్యాయరని స్పష్టం చేసింది. ట్యాక్స్ కన్సల్టెంట్స్, రైల్వేశాఖకు చెందిన సిబ్బందితో సహా కొందరు పోలీస్ అధికారులు ఈ స్కామ్ లో పాత్రధారులుగా ఐటీ శాఖ గుర్తించింది.
హైదరాబాద్, విజయవాడ నగరాలకు చెందిన కొన్ని సాంకేతిక కేంద్రాలు ఈ స్కామ్ లో సూత్రధారులుగా ఉన్నారని పేర్కొంది.
ఈ మేరకు ఐటీ శాఖకు చెందిన దర్యాప్తు అధికారులు బుధవారం నిజాంపేట,ఎల్బీనగర్,వనస్థలిపురం ప్రాంతాలను పరిశీలించారు.
కేసులో భాగంగా పలువురు ఉద్యోగులతో పాటు ఆయా కంపెనీలకూ నోటీసులు ఇస్తామని ఐటీ అధికారులు తెలిపారు.
details
రీ ఫండ్ లో కన్సల్టెంట్లకు 10 శాతం కమీషన్
దర్యాప్తు పూర్తిస్థాయిలో జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామని పేర్కొన్నారు.
సిటీలో కొంత మంది ఐటీ కన్సల్టెంట్స్ పేరుతో ఫేక్ డాక్యుమెంట్స్ ఆధారంగా ఐటీ చట్టంలోని 80 సీసీ, 80 డీడీ సెక్షన్ల కింద రిఫండ్ కోసం దరఖాస్తులు చేశారని గుర్తించారు.
సదరు ఉద్యోగులకు అర్హత లేకున్నా తప్పుడు ఆధారాలను సమర్పించినట్టు తేల్చారు. దాదాపు 1000 వరకు ఇలాంటి దరఖాస్తులే చేశారన్నారు.
అయితే కన్సల్టెంట్స్ ఆయా శాఖల ఉద్యోగులను తమ ఏజెంట్ల ద్వారా సంప్రదించి ఈ కుంభకోణానికి తెరలేపారన్నారు.
ఉద్యోగులకు ట్యాక్స్ రీఫండ్ దరఖాస్తులు చేయిస్తామని, రీ ఫండ్ లో 10 శాతం కమీషన్ ఇవ్వాలని ఉద్యోగులకు ఎరేసినట్టు చెప్పారు.