Stock Markets-Relaince-Ambani: ఒడిదుడుకులతో స్టాక్ మార్కెట్లు...వరుసగా రెండో రోజూ భారీ నష్టాలు
రిలయెన్స్ షేర్లు (Reliance) వరుసగా పతనం అవుతున్నాయి. అంబానీ (Mukesh Ambani) కి ఒక్కరోజే వేల కోట్ల రూపాయల నష్టం వచ్చింది. గత రెండు రోజులుగా భారత స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. ఆదాయపన్ను విధానంపై ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం సమూల మార్పులు తీసుకొస్తుందని ఒక నివేదిక రావడం దీనంతటికీ కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు ఒత్తిడికి లోనై అమ్మకాలు జరిపారు. దీంతో సూచీలు కుదిలైపోయాయి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE)ఇంట్రాడే సూచీ సెన్సెక్స్ ఒక దశలో 1100 పాయింట్లు నష్టపోయింది.
అంబానీకి వేల కోట్ల నష్టం
730 పాయింట్లు కోల్పోయి చివరకు 73,878 వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ (NIFTY) 170 పాయింట్లు నష్టపోయి 22,476 వద్ద స్థిరపడింది. ఇదే క్రమంలో భారీ విలువ ఉన్నషేర్లు పెద్ద ఎత్తున నష్టపోయాయి. ముకేశ్ అంబానీకి చెందిన రిలయెన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ కూడా రెండు శాతం పైగా పడిపోయింది. ఇంట్రాడేలో దాదాపు మూడు శాతానికి పైగా పతనమైంది. ఒక్కరోజులోనే ఏకంగా ముఖేష్ అంబానీకి 44 వేల కోట్లు తగ్గిపోయాయి.