NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గుజరాత్‌,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు
    తదుపరి వార్తా కథనం
    గుజరాత్‌,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు
    నీట మునిగిన రాజస్థాన్ లోని సాంచోర్ పట్టణం

    గుజరాత్‌,రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌లను ముంచెత్తిన భారీ వర్షాలు.. 3 రాష్ట్రాలకు పొంచిఉన్న వరద ముప్పు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 19, 2023
    12:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్ ను ముప్పతిప్పలు పెట్టిన అతి తీవ్ర తుపాను బిపోర్‌జాయ్‌, క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం తీరం దాటింది.

    దీంతో గుజరాత్‌ సహా పరిసర రాష్ట్రాలు రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించి భారీ వరదలను మిగిల్చింది. ఈ క్రమంలో దాదాపు లక్ష మంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించామని గుజరాత్ అధికారులు వెల్లడించారు.

    ఎక్కడా ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా అందరినీ సేఫ్ గా రక్షించి పునరావాసం కల్పించామని తెలిపారు. మరో 12 గంటల పాటు వాయుగుండం తీవ్రత కొనసాగనున్నట్లు వివరించారు.

    DETAILS

    కేంద్రం సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే ఎదుర్కొన్నాం : అధికారులు

    బిపోర్‌జాయ్‌ తుపాను ప్రభావిత గుజరాత్‌లోని బనస్కాంత, పఠాన్‌ జిల్లాల్లో ఇప్పటికే భారీగా వర్షాలు పడుతున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

    ఆదివారం సాయంత్రం నాటికే అమీర్‌గఢ్‌ ప్రాంతంలో 206 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు పేర్కొన్నారు. దంతా, ధనేరా ప్రాంతాల్లో 168 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు.

    అయితే గుజరాత్ లోని కచ్‌లో మాత్రం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గుజరాత్‌లోని 9 జిల్లాలను తుపాను భీకరంగా వణికించింది. అయినప్పటికీ ఎక్కడా ప్రాణనష్టం లేకుండా అందరినీ కాపాడినట్లు అధికారులు వెల్లడించారు. కేంద్రం సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే తుపానును సమర్థంగా ఎదుర్కొగలిగినట్లు స్పష్టం చేశారు.

    DETAILS

    రానున్న 24 గంటల్లో వానలే వానలు : ఐఎండీ

    మరోవైపు పునరావాసం కేంద్రాల్లోనే సుమారు 707 మంది పిల్లలు పుట్టారన్న అధికారులు, దాదాపు 2 లక్షల పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.

    ఈశాన్య రాజస్థాన్‌, పశ్చిమ మధ్యప్రదేశ్‌ల్లో తుపాను ప్రభావంతో ఆదివారం భారీగా వర్షాలు కురిశాయి. సోమవారం సైతం వానలు కురవనున్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.

    దక్షిణ రాజస్థాన్‌, ఉత్తర గుజరాత్‌లలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న కారణంగా రాజస్థాన్‌లోని 3 జిల్లాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. జలోర్‌, సిరోహి, బార్మెర్‌ జిల్లాల్లోనైతే వరద పోటెత్తడం గమనార్హం.

    సిరోహిలోని బటీసా డ్యాంలో నీటిమట్టం అమాంతం 315 మీటర్లకు పెరిగింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తుపాను
    గుజరాత్
    మధ్యప్రదేశ్
    రాజస్థాన్

    తాజా

    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్

    తుపాను

    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    రైతన్నలకు పిడిగులాంటి వార్త; ముంచుకొస్తున్న 'మోచా' తుపాను  ఇండియా లేటెస్ట్ న్యూస్
    ఏపీ, తెలంగాణకు తుపాను ఎఫెక్ట్; మరో నాలుగు రోజులపాటు వానలు ఆంధ్రప్రదేశ్
    మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారనున్న 'మోచా'; బెంగాల్‌లో ఎన్‌డీఆర్ఎఫ్ మోహరింపు తాజా వార్తలు

    గుజరాత్

    బీబీసీ డాక్యుమెంటరీ నిషేధంపై ఫిబ్రవరి 6న సుప్రీంకోర్టులో విచారణ సుప్రీంకోర్టు
    Asaram Bapu: అత్యాచార కేసులో ఆశారాం బాపునకు జీవిత ఖైదు భారతదేశం
    బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    ముంబై బుల్లెట్ రైలుకు మొట్టమొదటి అండర్ సీ టన్నెల్ 3-అంతస్తుల స్టేషన్‌ ముంబై

    మధ్యప్రదేశ్

    2024 సెమీ ఫైనల్: ఎన్నికల ఏడాదిలోకి తెలంగాణ.. మరో ఎనిమిది రాష్ట్రాలు కూడా.. తెలంగాణ
    గుడి గోపురంపై కుప్పకూలిన విమానం భారతదేశం
    కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కన్నుమూత, ప్రధాని మోదీ సంతాపం జనతాదళ్ (యునైటెడ్)
    జీ20: భోపాల్‌లో రెండు రోజుల పాటు 'థింక్-20' సమావేశాలు శివరాజ్ సింగ్ చౌహాన్

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? అసెంబ్లీ ఎన్నికలు
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025