NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ
    తదుపరి వార్తా కథనం
    రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ
    అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

    రాగల 5 రోజులు ఏపీ, తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 24, 2023
    05:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పాటయ్యేందుకు అనుకూలమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి.

    జులై 25 నాటికి ఏపీలోని ఉత్తరాంధ్రకు సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని, మరో 24 గంటల్లోనే (జులై 26 వరకు) వాయుగుండంగా బలపడే అవకాశాలున్నట్లు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.

    ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 24 నుంచి 28 వరకు అతిభారీ వర్షాలు కురుస్తాయని, అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.

    తాజాగా వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల వెంట ఆవర్తనం ఏర్పడిందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది.

    DETAILS

    ఈ నెల 24 నుంచి 28 వరకు అతిభారీ వర్షాలు : ఐఎండీ

    ఏపీలోని కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 5 రోజుల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

    మరోవైపు రాయలసీమ ప్రాంతంలో ఈ నెల 24 నుంచి 26 వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది.

    జులై 25న మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురవనున్నట్లు పేర్కొంది. ఇక తెలంగాణలోనూ జులై 25 నుంచి 28 వరకు అత్యంత భారీ వర్షాలు పడతాయని ఐఎండీ చెప్పింది.

    ఏటా జులై నుంచి నవంబరు వరకు తుపానులకు అనుకూల సీజన్ గా భావిస్తారు. ఇందులో భాగంగానే మొదట నైరుతి రుతుపవనాలు, అనంతరం ఈశాన్య రుతుపవనాలు తుపానులకు బలాన్ని సమకూర్చుతాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారీ వర్షాలు
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ
    ఐఎండీ

    తాజా

    SRH vs KKR: కోల్‌కతా ఘోర ఓటమి.. హ్యాట్రిక్ విజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించిన సన్ రైజర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్
    Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే! సన్ రైజర్స్ హైదరాబాద్
    Kakani Govardhan: క్వార్ట్జ్‌ అక్రమాల కేసు.. మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి అరెస్టు కాకాణి గోవర్ధన్ రెడ్డి
    GT vs CSK : గుజరాత్ ఓటమి.. చివరి మ్యాచును విజయంతో ముగించిన సీఎస్కే చైన్నై సూపర్ కింగ్స్

    భారీ వర్షాలు

    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం  దిల్లీ
    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర  తాజా వార్తలు
    తెలంగాణకు ఎల్లో అలెర్ట్ జారీ.. మరో 2 రోజులు భారీ వర్షాలు తెలంగాణ
    #NewsBytesExplainer: వర్షాలు తగ్గినా వరద గుప్పిట్లోనే దేశ రాజధాని.. దిల్లీ వరదలకు కారణాలు ఇవే  దిల్లీ

    ఆంధ్రప్రదేశ్

    అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ బీజేపీ
    రాగల 3 రోజులలో తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ   నైరుతి రుతుపవనాలు
    మున్నంగి సీఫుడ్స్ లో అమ్మోనియం గ్యాస్ లీక్..16 మంది కార్మికులకు అస్వస్థత,ఆస్పత్రికి తరలింపు ప్రభుత్వం

    తెలంగాణ

    దినదినాభివృద్ధి చెందుతున్న నిమ్స్; దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ సర్జరీ సౌకర్యం  హైదరాబాద్
    ఎన్నికల వేళ ఐఏఎస్ బదిలీలు.. జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా రొనాల్డ్ రోస్ నియామకం హైదరాబాద్
    ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్; భారీగా పెరిగిన సీట్లు తన్నీరు హరీష్ రావు
    మంగపేటలోని 23 గ్రామాలపై హైకోర్టు సంచలన తీర్పు.. 75 ఏళ్లకు గిరిజనులకు అనుకూలమైన తీర్పు  హైకోర్టు

    ఐఎండీ

    తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ తెలంగాణ
    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025