రాగల 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి 3 రోజుల పాటు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేద్కర్ తెలిపారు. ఈ మేరకు అక్కడక్కడా పిడుగులు సైతం పడే ప్రమాదం పొంచి ఉందన్నారు. పంట పొలాల్లో పనిచేసే అన్నదాతలు, వ్యవసాయ కూలీలు, పశువుల, గొర్రెల కాపర్లు మరింత అప్రమత్తంగా మెలగాలని సూచించారు. వానలు కురుస్తున్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద నిల్చోకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసినట్లు అంబేద్కర్ వెల్లడించారు.
నేటి నుంచి ఆయా జిల్లాల్లో భారీ వర్షాలు
సోమవారం వర్షాలు కురవనున్న జిల్లాలు : అల్లూరి సీతారామరాజు , కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, వైయస్‌ఆర్ జిల్లాల్లో నేడు భారీ వర్షాలకు అవకాశం ఉంది. మంగళవారం వర్షాలు కురవననున్న జిల్లాలు : పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు, వైయస్‌ఆర్, నంద్యాల జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురవనున్నాయి. బుధవారం వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలు : పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనుంది.