జులైలో తెలంగాణలో జోరు వానలు: వాతావరణ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాలం మొదలైనా వానలు సరిగ్గా కురవడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ నెలలో జోరు వానలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.
నిజానికి నైరుతి రుతుపవనాలు జూన్ నెల మొదట్లోనే తెలంగాణను తాకాల్సి ఉంది. కానీ కాస్త ఆలస్యంగా జూన్ 22వ తేదీన రుతుపవనాలు తెలంగాణ చేరుకున్నాయి.
ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఈ నెలంతా వర్షాలు జోరుగా కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడి చేస్తుంది.
ఈ నెల కురవాల్సిన సాధారణ వర్షపాతం 24.44కంతే పదిశాతం అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందట.
Details
జులై 4,5,6 తేదీల్లో భారీగా వర్షాలు
ఈ నెలలో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరిస్తుంది.
ముఖ్యంగా 4,5,6 తేదీల్లో తెలంగాణకు భారీ వర్ష సూచన ఉన్నట్టుగా తెలియజేసింది.
జూన్ నెలలో తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా 12.93సెంటిమీటర్ల వర్షపాతానికి బదులు 7.27సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
జూన్ నెల విషయాలు పక్కన పెడితే జులైలో నెలంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.