NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bipin Rawat: 'మానవ తప్పిదం' కారణంగా 2021 ఛాపర్ క్రాష్ CDS బిపిన్ రావత్ మృతి: పార్ల్ ప్యానెల్ నివేదిక
    తదుపరి వార్తా కథనం
    Bipin Rawat: 'మానవ తప్పిదం' కారణంగా 2021 ఛాపర్ క్రాష్ CDS బిపిన్ రావత్ మృతి: పార్ల్ ప్యానెల్ నివేదిక
    'మానవ తప్పిదం' కారణంగా 2021 ఛాపర్ క్రాష్ CDS బిపిన్ రావత్ మృతి: పార్ల్ ప్యానెల్ నివేదిక

    Bipin Rawat: 'మానవ తప్పిదం' కారణంగా 2021 ఛాపర్ క్రాష్ CDS బిపిన్ రావత్ మృతి: పార్ల్ ప్యానెల్ నివేదిక

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 20, 2024
    08:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశ అత్యున్నత సైనికాధికారి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కీలక నివేదికను సమర్పించింది.

    ఈ నివేదికలో పైలట్‌ తప్పిదమే ప్రధాన కారణంగా వెల్లడించబడింది. మానవ తప్పిదం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని కమిటీ స్పష్టం చేసింది.

    2021 డిసెంబర్ 8న ఎంఐ-17 హెలికాప్టర్ తమిళనాడులోని కూనూర్ సమీపంలో క్రాష్ అయ్యింది.

    ఈ ఘటనలో బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్ సహా మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

    ఈ ప్రమాదంపై నివేదికను రూపొందించడానికి మూడు సంవత్సరాలు పట్టింది.

    బుధవారం కమిటీ ఈ నివేదికను లోక్‌సభకు అందజేసింది, అందులో మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చింది.

    వివరాలు 

    34 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రమాదాలు

    18వ లోక్‌సభ స్టాండింగ్ కమిటీ నివేదిక ప్రకారం, 2017 నుంచి 2022 మధ్యలో మొత్తం 34 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రమాదాలు జరిగాయి.

    2021-22 ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది ప్రమాదాలు నమోదయ్యాయి. 2021 డిసెంబర్ 8న జరిగిన ప్రమాదాన్ని కమిటీ ''హ్యూమన్ ఎర్రర్ (ఎయిర్‌క్రూ)''గా నిర్ధారించింది.

    ప్రమాద సమయంలో వాతావరణం అనూహ్యంగా మారిపోవడం, హెలికాప్టర్ మేఘాల్లోకి ప్రవేశించడం ప్రమాదానికి దారితీసిన అంశాలుగా పేర్కొంది.

    ఫ్లైట్ డేటా, కాక్‌పిట్ వాయిస్ రికార్డుల విశ్లేషణ, సాక్షుల విచారణ ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చింది.

    వివరాలు 

    భారత సాయుధ దళాల తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా బిపిన్ రావత్

    2021 డిసెంబర్ 8న జరిగిన ఈ దుర్ఘటనలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక రావత్, ఇంకా 12 మంది సిబ్బంది సూలూర్ ఎయిర్‌ఫోర్స్ బేస్ నుంచి వెల్లింగ్టన్ డిఫెన్స్ స్టాఫ్ సర్వీసెస్ కాలేజీకి ప్రయాణిస్తున్న సమయంలో హెలికాప్టర్ కొండలపై కూలిపోయింది.

    ఈ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు, కానీ చికిత్స పొందుతూ వారం తర్వాత ఆయన మరణించారు.

    బిపిన్ రావత్ జనవరి 2020 నుంచి డిసెంబర్ 2021లో మరణించే వరకు భారత సాయుధ దళాల తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా పని చేశారు.

    వివరాలు 

    2016 డిసెంబర్‌లో కమాండర్ ఇన్ చీఫ్‌గా నియామకం 

    భారత ప్రభుత్వం ఆయనకు 2021లో పద్మవిభూషణ్‌ను ప్రకటించింది. ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో 1958 మార్చి 16న జన్మించిన బిపిన్ రావత్, 1978 డిసెంబర్‌లో డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షణ పొందారు.

    ఆయన 2016 డిసెంబర్‌లో కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    భారతదేశం

    SCO Meeting: పాక్‌లో భారత విదేశాంగ మంత్రి పర్యటన.. ప్రధానితో విందుకు ఆహ్వానం పాకిస్థాన్
    Canada: భారత్‌పై కెనడా మరోసారి ఆరోపణలు.. ఘాటుగా స్పందించింన కేంద్రం కెనడా
    MEA on Canada: మరింత దిగజారిన భారత్‌, కెనడా దౌత్య సంబంధాలు.. భారత్‌ దౌత్యవేత్తలు వెనక్కి! కెనడా
    India-Canada: నిజ్జర్‌ హత్య కేసు.. బిష్ణోయ్‌ గ్యాంగ్‌తో కలిసి భారత్‌ కుట్ర?.. కెనడా తీవ్ర ఆరోపణలు  కెనడా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025