Hyderabad: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం; హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి..!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌లో అదుపు తప్పిన కారు.. హుస్సేన్ సాగర్ రేలింగ్‌ను ఢీకొట్టి ఆగిపోయింది.
అయితే కారులోని ఎయిర్ బెలున్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. ఆ తర్వాత వారు కారును అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ప్రమాదం ధాటికి కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది.
ఫుట్ పాత్ పై ఉన్న ఓ చెట్టు కూలిపోయింది. ఈ ప్రమాద ఘటన తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనంతరం క్రేన్ సాయంతో కారును అక్కడి నుంచి తరలించారు.
Details
అతివేగమే కారణంగానే రోడ్డు ప్రమాదం
అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కారులో ఉన్న ప్రయాణికులు మద్యం సేవించినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి.
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. మరోవైపు అతివేగమే రోడ్డు ప్రమాదాలకు కారణమని పోలీసులు చెబుతున్నారు.