LOADING...
Hussainsagar: డేంజర్‌లో హుస్సేన్‌సాగర్.. కీలక ఆదేశాలిచ్చిన జీహెచ్ఎంసీ
డేంజర్‌లో హుస్సేన్‌సాగర్.. కీలక ఆదేశాలిచ్చిన జీహెచ్ఎంసీ

Hussainsagar: డేంజర్‌లో హుస్సేన్‌సాగర్.. కీలక ఆదేశాలిచ్చిన జీహెచ్ఎంసీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 01, 2024
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లో హుస్సేన్ సాగర్‌కు వరద నీరు పోటెత్తుతోంది. బంజారా హిల్స్, పికెట్, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి వచ్చే వరదనీరు హుస్సేన్ సాగర్‌లోకి చేరడంతో నీటిమట్టం గరిష్ట స్థాయికి పెరిగింది. సాగర్ నీటి మట్టం పూర్తి స్థాయికి చేరడంతో తూముల ద్వారా వరదనీటిని మూసీ నదిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లోని నీటిమట్టం 513.43 మీటర్లకు చేరుకుంది, అయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లుగా ఉంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ, అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.