Charminar Express: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్(Hyderabad)లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బుధవారం చార్మినార్ ఎక్స్‌ప్రెస్(Charminar Express) రైలు ప్లాట్‌ఫాంపై పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు.
రైలు చెన్నై నుంచి నాంపల్లి వస్తున్న వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
నాంపల్లి రైల్వే స్టేషన్(Nampally railway station)లో రైలు ప్లాట్‌ఫారమ్‌పైకి రాగానే.. అది ట్రాక్ తప్పి.. సైడ్ వాల్ ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు బోగీలు పట్టాలు తప్పాయి.
రైలు పట్టాలు తప్పడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో పలు రైలు సర్వీసులపై ప్రభావం పడింది. కొన్ని రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రైల్వే స్టేషన్‌లో గాయపడిన ప్రయాణికుడు
Charminar Express from #Chennai to Hyderabad derailed at #Nampally railway station.
— Sudhakar Udumula (@sudhakarudumula) January 10, 2024
Minor injuries reported among some passengers.#Hyderabad #Derailment #Charminarexpress pic.twitter.com/ggnItYXTU2