Loading...
Telangana: హైదరాబాద్‌లో పెరిగిన చలి తీవ్రత.. 14 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
హైదరాబాద్‌లో పెరిగిన చలి తీవ్రత.. 14 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

Telangana: హైదరాబాద్‌లో పెరిగిన చలి తీవ్రత.. 14 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2026
08:43 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉత్తర, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న పొడి గాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. ఆదివారం సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యు)లో రాష్ట్రంలోనే అత్యల్పంగా 11.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 13.4 డిగ్రీలకు పడిపోయింది. ఆసిఫాబాద్ జిల్లాలో వణికిస్తున్న చలి కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా నమోదైంది. తిర్యానిలో 12 డిగ్రీలు, కెరమెరిలో 13.3, వాంకిడిలో 13.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జైనూర్, కాగజ్‌నగర్, రెబ్బెన ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 14.9 డిగ్రీలుగా రికార్డయ్యాయి.

వివరాలు 

గ్రేటర్ హైదరాబాద్‌లోనూ తగ్గిన ఉష్ణోగ్రతలు

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కాప్రా, చార్మినార్ ప్రాంతాల్లో అత్యల్పంగా 13.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

పటాన్‌చెరులో 13.8 డిగ్రీలు, అమీర్‌పేట, శేరిలింగంపల్లిలో 14.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

నగరంలో సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో పది రోజుల పాటు ఇదే తరహా చలి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వివరాలు 

పొగమంచుతో ప్రయాణికులకు ఇబ్బందులు

రాష్ట్రంలో మరికొన్ని రోజుల పాటు పొడి వాతావరణమే కొనసాగనుంది. మరోవైపు ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకుంటుండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పొగమంచు ప్రభావంతో ఎంజీబీఎస్, జేబీఎస్ వంటి ప్రధాన బస్ స్టేషన్లలో ఉదయం వేళ ప్రయాణికుల రద్దీ కూడా తగ్గింది.

పెరుగుతున్న చలి తీవ్రత నేపథ్యంలో చిన్నపిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

20 తర్వాత వర్షాలు కురిసే అవకాశం

బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాతావరణ మార్పుల ప్రభావంతో ఈ నెల 20వ తేదీ తర్వాత తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

ADVERTISEMENT