హైదరాబాద్‌లో 1.05కోట్లు దాటిన జనాభా; ఐక్యరాజ్య సమితి వెల్లడి
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో జనాభా ఐక్యరాజ్య సమితి కీలక లెక్కలను వెల్లడించింది. హైదరాబాద్‌లో జనాభా 1.05కోట్లు దాటినట్లు ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం వెల్లడించింది. 2023 నాటి చివరి కల్లా జనాభా మరింత పెరగొచ్చని అంచనా వేసింది. అది 1.08కోట్లకు చేరొచ్చని పేర్కొంది. జభానా పరంగా చూసుకుంటే భారత్‌లో హైదరాబాద్ 6వ స్థానంలో నిలిచినట్లు చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా జనాభా పరంగా హైదరాబాద్ 34వ స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది.
తెలంగాణలోని మూడోవంతు జనాభా హైదరాబాద్‌లోనే
రాష్ట్రంలో పట్టణీకరణ పెరిగిన నేపథ్యంలో తెలంగాణలోని మూడోవంతు జనాభా హైదరాబాద్‌లోనే ఉంటున్నట్లు ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం పేర్కొంది. హైదరాబాద్ జనాభా 1950లో 10లక్షలు ఉండగా, 1975 నాటికి ఆ సంఖ్య 20లక్షలు దాటినట్లు ఐక్యరాజ్య సమితి చెప్పింది. ఆ తర్వాత నుంచి హైదరాబాద్‌లో జనాభా విపరీతంగా పెరుగుతున్నట్లు పేర్కొంది. ఏడాదికి 5లక్షల మంది హైదరాబాద్‌కు వలస వస్తున్నట్లు ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం పేర్కొంది. హైదరాబాద్ జనాభాలో 14ఏళ్లలోపు పిల్లలు 25శాతం వరకు ఉన్నట్లు వెల్లడించింది. అలాగే 15ఏళ్ల నుంచి 64ఏళ్ల వయసు వారు హైదరాబాద్‌లో దాదాపు 60శాతం మంది ఉన్నట్లు చెప్పింది.