LOADING...
Hyderabad : ప్రపంచంలోని ఉత్తమ 100 నగరాల్లో హైదరాబాద్‌.. ఎన్నో స్థానంలో ఉందంటే?
ప్రపంచంలోని ఉత్తమ 100 నగరాల్లో హైదరాబాద్‌.. ఎన్నో స్థానంలో ఉందంటే?

Hyderabad : ప్రపంచంలోని ఉత్తమ 100 నగరాల్లో హైదరాబాద్‌.. ఎన్నో స్థానంలో ఉందంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యుత్తమ 100 నగరాల జాబితాలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ తన స్థానాన్ని దక్కించుకుంది. రిసోనెన్స్ కన్సల్టెన్సీ,ఇప్సోస్ మార్కెట్ రీసెర్చ్ కలిసి రూపొందించిన 'వరల్డ్ బెస్ట్ సిటీస్' రిపోర్ట్‌లో భాగంగా మొత్తం 276 నగరాలను పరిశీలించారు. వాటిలోంచి ఎంచుకున్న టాప్ 100 నగరాల్లో హైదరాబాద్ కూడా చోటు పొందింది. ఈ గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో 'క్యాపిటల్స్ ఆఫ్ క్యాపిటల్'గా ప్రసిద్ధి పొందిన లండన్ వరుసగా 11వసారి ప్రథమ స్థానాన్ని సాధించింది. రెండో స్థానంలో న్యూయార్క్, మూడో స్థానంలో పారిస్, నాలుగో స్థానంలో టోక్యో నిలిచాయి. ఐదో స్థానంలో మాడ్రిడ్, ఆరో స్థానంలో సింగపూర్, ఏడో స్థానంలో రోమ్, ఎనిమిదో స్థానంలో బెర్లిన్ నిలిచాయి.

వివరాలు 

టేస్టీ సిటీస్ జాబితాలో 50వ స్థానంలో  హైదరాబాద్ 

భారతదేశానికి చెందిన నాలుగు నగరాలు ఈ టాప్ 100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు 29వ స్థానాన్ని పొందగా, ముంబై 40వ స్థానం,ఢిల్లీ 54వ స్థానం సంపాదించాయి. హైదరాబాద్‌ 82వ ర్యాంక్‌తో ఈ జాబితాలో నిలిచింది. అంతేకాదు, హైదరాబాద్ మరో ప్రత్యేక గుర్తింపు కూడా పొందింది. ప్రపంచంలో అత్యుత్తమ "టేస్టీ సిటీస్" జాబితాలో 50వ స్థానాన్ని దక్కించుకుంది.

వివరాలు 

అగ్రస్థానంలో  బెంగళూరు 

భారతీయ నగరాల ర్యాంకింగ్స్‌లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. అభివృద్ధి చెందిన టెక్ ఎకోసిస్టం, విస్తృత కార్పొరేట్ కార్యకలాపాలు బెంగళూరును 29వ స్థానానికి చేర్చాయి. దేశ ఆర్థిక ప్రధాన కేంద్రంగా పేరొందిన ముంబై ఉద్యోగావకాశాలు, సాంస్కృతిక వైవిధ్యం, ఇన్నొవేషన్ కేంద్రంగా 40వ స్థానం పొందింది. రాజకీయ ప్రాధాన్యం, బలమైన రవాణా కనెక్టివిటీ, మెరుగవుతున్న మౌలిక వసతులు ఢిల్లీని 54వ స్థానంలో నిలిపాయి. ఐటీ, టెక్ రంగాల విస్తరణతో వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్ 82వ స్థానం సాధించింది. అలాగే, దేశంలో అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మరోసారి తన స్థిరమైన స్థానాన్ని చూపించింది. చెన్నై, కోల్‌కతా వంటి ప్రధాన మెట్రో నగరాలను కూడా వెనక్కి నెట్టి ముందంజలో నిలిచింది.