Indigo Flight: విమానంలో వింత ప్రవర్తన.. టాయిలెట్‌లోకి వెళ్లి సిబ్బందిని హడలెత్తించిన ప్యాసింజర్
హైదరాబాద్ నుంచి పట్నా బయల్దేరిన విమానం గాల్లో ఉండగానే ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఝలక్ ఇచ్చాడు. ఈ మేరకు బాత్రుంలోకి వెళ్లిన మొహ్మమద్ కమర్ రియాజ్ చాలా సేపు అందులోనే ఉండిపోయాడు. ఈ క్రమంలోనే వింత ప్రవర్తనతో సిబ్బందిని బెంబెలెత్తించాడు. ఇండిగో 6E 126 నంబర్ విమానం ఆదివారం గాల్లో ఉండగానే సదరు ప్రయాణికుడు టాయిలెట్‌లోకి వెళ్లి గడియ వేసుకున్నాడు. సిబ్బంది ఎంత పిలిచినా గడియ తీయలేదు. ఫ్లైట్ పట్నాలో దిగాక పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. రియాజ్ మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడని, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడని ఇదే విమానంలో ప్రయాణించిన అతడి సోదరుడు తెలిపాడు. రిపోర్టులు పరిశీలించిన అధికారులు, ప్రయాణికుడి మానసిక స్థితి బాగా లేదని తెలుసుకుని అతన్ని విడిచిపెట్టారు.