Page Loader
విమానాలను తాకిన కర్ణాటక బంద్ సెగ.. 44 ఫ్లైట్ సర్వీసుల నిలిపివేత
44 ఫ్లైట్ సర్వీసుల నిలిపివేత

విమానాలను తాకిన కర్ణాటక బంద్ సెగ.. 44 ఫ్లైట్ సర్వీసుల నిలిపివేత

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 29, 2023
11:58 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడుకు, కర్ణాటక నుంచి కావేరీ జలాలు విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన బంద్ జనజీవనాన్ని స్తంభింపజేసింది. బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 44 విమానాలు రద్దయ్యాయి. ఈ మేరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. స్కూళ్లు, కాలేజీలు సైతం బందయ్యాయి. కన్నడ ఒక్కట అనే సంస్థ స్టేట్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రయాణికులు, టూర్లు వాయిదా వేసుకున్నారు. విమానాశ్రయంలో ఉద్రిక్తత కర్ణాటక బంద్ సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలోకి కొందరు కర్ణాటక అనుకూల వాదులు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. కావేరి జలాల తరలింపును వ్యతిరేకిస్తూ నినాదిస్తుండగా పోలీసులు అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దిష్టిబొమ్మను ఆందోళనకారులు వేర్వేరు చోట్ల దహనం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 44 విమానాలు బంద్