LOADING...
Hyd metro: నేటితో హైదరాబాద్ మెట్రోకు 8 ఏళ్లు.. ప్రయాణికుల్లో 51 శాతానికి పైగా ఉద్యోగులేనని సర్వేలో వెల్లడి
ప్రయాణికుల్లో 51 శాతానికి పైగా ఉద్యోగులేనని సర్వేలో వెల్లడి

Hyd metro: నేటితో హైదరాబాద్ మెట్రోకు 8 ఏళ్లు.. ప్రయాణికుల్లో 51 శాతానికి పైగా ఉద్యోగులేనని సర్వేలో వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 28, 2025
09:56 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మెట్రో రైలు ఏడేళ్ల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసి,నేటి నుంచి ఎనిమిదో ఏడాదిలోకి ప్రవేశిస్తోంది. నగరవాసులకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తూ, ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపించడంలో మెట్రో కీలకపాత్ర పోషిస్తోంది. లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ, ఇప్పుడు రెండో దశ విస్తరణకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం మెట్రో మూడు ప్రధాన కారిడార్లలో కలిపి 69.2 కిలోమీటర్ల ప్రస్థానం సాగిస్తోంది. రోజువారీ సుమారు 4.80 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు గణనలలో తేలింది. వీరిలో 51.5 శాతం మంది ఉద్యోగులు, 30.3 శాతం గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవడానికి మెట్రోను ఉపయోగిస్తున్నారు.

వివరాలు 

పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రూ.14,132 కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టు

విద్యార్థులు సుమారు 6.1 శాతం మంది. 2017 నవంబర్ 29న ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 80.21 కోట్ల మంది మెట్రో సేవలను ఉపయోగించారని అంచనా. ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. 2012లో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో రూ.14,132 కోట్ల వ్యయంతో మెట్రో ప్రాజెక్టు ప్రారంభమైంది. భవిష్యత్ రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం రెండో దశ విస్తరణపై దృష్టి పెట్టింది.

వివరాలు 

రూ.43,848 కోట్లతో రెండో దశ విస్తరణకు ప్రభుత్వ ప్రణాళికలు 

మొత్తం ఎనిమిది కారిడార్లలో 163 కిలోమీటర్ల కొత్త లైన్లను నిర్మించడానికి రూ.43,848 కోట్ల వ్యయం అంచనా వేసారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు (డీపీఆర్) కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. 2026 మార్చి నాటికి వీటికి అనుమతులు లభించే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు. రెండో దశ పూర్తి అయిన తరువాత, హైదరాబాద్ మెట్రో నగర రవాణా వ్యవస్థలో మరింత కీలక పాత్ర పోషించనుంది.

Advertisement