LOADING...
Hyderabad Police: సామాజిక మాధ్యమాలపై నిఘా.. ఏఐతో కొత్త వ్యవస్థ ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు
సామాజిక మాధ్యమాలపై నిఘా..ఏఐతో కొత్త వ్యవస్థ ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు

Hyderabad Police: సామాజిక మాధ్యమాలపై నిఘా.. ఏఐతో కొత్త వ్యవస్థ ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 19, 2026
08:42 am

ఈ వార్తాకథనం ఏంటి

సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు,తప్పుడు ప్రచారాలు,సున్నిత అంశాలపై విద్వేషపూరిత పోస్టులు చేసే వారిపై హైదరాబాద్ పోలీసులు ఇక మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. ఇందుకోసం ఏఐ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. "సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్"పేరుతో రూపొందించిన "సాక్ ఐ" అనే ప్రత్యేక యాప్ ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సోమవారం ప్రారంభించారు. నగరంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఆన్‌లైన్ వేదికల ద్వారా తప్పుడు ప్రచారాలు నిర్వహించే వారిని గుర్తించడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను విశ్లేషించేందుకు హైదరాబాద్ పోలీసుల సమాచార సాంకేతిక విభాగం ఈ ఆధునిక వ్యవస్థను రూపొందించింది. "సాక్ ఐ"ద్వారా పర్యవేక్షణ ప్రక్రియ మొత్తం స్వయంచాలక విధానంలో నిరంతరాయంగా కొనసాగనుంది.

వివరాలు 

సాక్‌ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఈ వ్యవస్థలో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్‌ ఇంటెలిజెంట్‌ డ్యాష్‌బోర్డ్‌ ద్వారా డయల్-100 కాల్స్‌, అంతర్గత నిఘా సమాచారం,నగరంలో చోటుచేసుకునే ప్రధాన ఘటనల వివరాలు ఒకేచోట అందుబాటులో ఉంటాయి. దీంతో అధికారులకు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై స్పష్టమైన అవగాహన లభించనుంది. కృత్రిమమేధ సాంకేతికతతో రూపొందిన ఈ వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా నేరాల నివారణలో కీలక మార్పులకు దోహదపడుతుందని సీపీ సజ్జనార్ తెలిపారు. ప్రయోగాత్మక దశలోనే"సాక్ ఐ"గణనీయమైన ఫలితాలు సాధించినట్లు అధికారులు వెల్లడించారు. ఈఏడాది ఆరంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్‌రోడ్ ఘటనకు సంబంధించిన 85 విద్వేషపూరిత, మతపరంగా సున్నితమైన అంశాలను ఈ వ్యవస్థ గుర్తించింది. అలాగే గుడిమల్కాపూర్ వివాదానికి సంబంధించి పలు సామాజిక మాధ్యమ ఖాతాల్లో ఉన్న 126 పోస్టులను కూడా గుర్తించినట్లు తెలిపారు.

వివరాలు 

సాక్‌ ఐ తన ప్రయోగాత్మక దశలోనే అద్భుతమైన విజయాన్ని సాధించింది.

మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతకు సంబంధించిన అంశాలపై కూడా ఈ వ్యవస్థ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్‌, సైబర్‌ బుల్లింగ్‌, స్టాకింగ్‌ వంటి అంశాలను ఏఐ మోడల్స్‌ స్వయంగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని అధిక, మధ్యస్థ, తక్కువ ప్రమాద స్థాయిలుగా విభజిస్తుంది. అభ్యంతరకరమైన పోస్టులను తొలగించేందుకు సంబంధిత సామాజిక మాధ్యమ సంస్థలకు సమాచారం పంపుతుంది. ప్రజల నుంచి సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా ఈ వ్యవస్థ నిరంతరం పర్యవేక్షించనుంది. ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించి, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించే విధంగా ఈ వ్యవస్థను రూపొందించినట్లు అధికారులు తెలిపారు.

Advertisement