తదుపరి వార్తా కథనం

TS 1oth Results 2024:నేడే తెలంగాణ 10వ తరగతి ఫలితాలు.. ఉదయం 11 గంటలకు TS SSC Results విడుదల
వ్రాసిన వారు
Sirish Praharaju
Apr 30, 2024
06:00 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను ఈ రోజు (మంగళవారం)ఉదయం 11 గంటలకు విడుదల చేసేందుకు తెలంగాణ ఎస్‌ఎస్‌సీ బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది.
పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.
తెలంగాణలో 10వ పరీక్ష మార్చి 18 నుండి ఏప్రిల్ 2 మధ్య జరిగింది.ఈ ఏడాది 10వ తరగతి పరీక్షకు 5,08,385మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు.
తెలంగాణ పదో తరగతి పరీక్షల బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://results.bsetelangana.org/ నుంచి TS 10th Results 2024 డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అలాగే మనబడి వెబ్‌సైట్ నుంచి కూడా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.