
Hyderabad Traffic : సద్దుల బతుకమ్మ వేడుకల నేపథ్యంలో.. హైద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
సద్దుల బతుకమ్మ సంబరాల సందర్భంగా హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగరం ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
అమరవీరుల స్మారకస్థూపం నుంచి అప్పర్ ట్యాంక్ బండ్‌లోని బతుకమ్మ ఘాట్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.
ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.
బతుకమ్మ సంబరాల నేపథ్యంలో ట్యాంక్ బండ్ సమీపంలో పార్కింగ్ సదుపాయం కల్పించామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఎన్టీఆర్ స్టేడియం, ఎన్టీఆర్ మార్గ్‌లోని రేస్ కోర్స్ రోడ్డు, జీహెచ్ఎంసీ కార్యాలయం-బీఆర్కే భవన్ మధ్య రోడ్డు, లోయర్ ట్యాంక్ బండ్ రోడ్‌పై పార్కింగ్ సౌకర్యం అందించబడింది.
వివరాలు
దారి మళ్లింపు ఇలా
రాణిగంజ్ నుంచి పీవీఎన్‌ఆర్ మార్గ్ (నెక్లెస్ రోడ్)వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట క్రాస్ రోడ్ వద్ద మినిస్టర్ రోడ్ వైపునకు మళ్లిస్తారు.
మినిస్టర్ రోడ్ నుంచి పీవీఎన్‌ఆర్ మార్గ్ వైపు వచ్చే వారిని నల్లగుట్ట క్రాస్ రోడ్ వద్ద రాణిగంజ్ వైపు మళ్లిస్తారు.
ఇక్బాల్ మినార్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్ వైపు మళ్లించనున్నారు.
లిబర్టీ నుంచి ఎగువ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను పాత అంబేడ్కర్ విగ్రహం వద్ద ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
ధోబీ ఘాట్ నుంచి చిల్డ్రన్స్ పార్క్, అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే వారిని డీబీఆర్ మిల్స్ వద్ద కవాడిగూడ క్రాస్ రోడ్ వైపునకు పంపిస్తారు.
వివరాలు
దారి మళ్లింపు ఇలా
సికింద్రాబాద్ నుంచి అప్పర్ ట్యాంక్ బండ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ వైపునకు మళ్లిస్తారు.
ట్యాంక్ బండ్ వైపు వచ్చే సిటీ బస్సులను కర్బలా మైదాన్ వద్ద బైబిల్ హౌస్ వైపునకు మళ్లించనున్నారు.
సికింద్రాబాద్ నుంచి ట్యాంక్ బండ్ మీదుగా ఎంజీబీఎస్ వైపు వెళ్లే అన్ని అంతర్ జిల్లా ఆర్టీసీ బస్సులు స్వీకర్ - ఉపకార్ జంక్షన్ వద్ద వైఎంసీఏ - సంగీత్ - మెట్టుగూడ - తార్నాక - నల్లకుంట - ఫీవర్ హాస్పిటల్ క్రాస్ రోడ్ - బర్కత్‌పురా - టూరిస్ట్ హోటల్ - నింబోలి అడ్డా - చాదర్‌ఘాట్ వద్ద మళ్లించబడతాయి.
వివరాలు
వాహనదారులు, ప్రయాణికులు సహకరించాలి
ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రయాణికులు పాత అంబేడ్కర్ విగ్రహం, కవాడిగూడ క్రాస్‌రోడ్స్, కట్ట మైసమ్మ, కర్బలా మైదాన్, రాణిగంజ్, నల్లగుట్ట, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ జంక్షన్ల వైపు వెళ్లొద్దని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
సద్దుల బతుకమ్మ వేడుకలకు వాహనదారులు, ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.