తదుపరి వార్తా కథనం

Hyderabad Youth Died: పుట్టిన రోజునాడే పుట్టెడు విషాదం.. కెనడాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Sep 16, 2024
04:04 pm
ఈ వార్తాకథనం ఏంటి
కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన హైదరాబాద్ నగరానికి చెందిన మీర్‌పేట్ యువకుడు ప్రణీత్ దురదృష్టవశాత్తూ చనిపోయాడు.
టొరంటోలోని లేక్ క్లియర్‌కి పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులతో కలిసి ప్రణీత్ ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు.
మీర్‌పేట్‌కు చెందిన రవి, సునీతలకు ఇద్దరు కుమారులు ఉండగా, ఇద్దరూ కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
ప్రణీత్ 2019లో ఎం.ఎస్ చదవడానికి కెనడాకు వెళ్లాడు.
Details
శోకసముద్రంలో కుటుంబ సభ్యులు
పుట్టిన రోజునే ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగి పోయారు.
తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
తమ కుమారుడి మృతదేహాన్ని ఇండియాకు తరలించడానికి ప్రభుత్వం సహకరించాలని వేడుకుంటున్నారు.