Siddaramaiah: భయపడను.. కుంభకోణంపై స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముడా కుంభకోణానికి సంబంధించి విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. ఈ కేసులో భయం లేకుండా పోరాడతానని పేర్కొన్నారు. బెంగళూరు ప్రత్యేక కోర్టు ముడా స్కామ్‌పై విచారణకు ఆదేశించడంతో పాటు, మైసూర్ పోలీసులకు మూడు నెలల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని సూచించింది. సిద్ధరామయ్యకు హైకోర్టులో గతమంగళవారం ఎదురుదెబ్బ తగిలింది. ఈ కుంభకోణంలో తనను విచారించేందుకు గవర్నర్ అనుమతిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ చర్యలు చట్టబద్ధమైనవని కోర్టు పేర్కొంది. ఇక బీజేపీ పార్టీ సిద్ధరామయ్యపై విరుచుకుపడింది.
సీఎం కుటుంబ సభ్యులు లబ్ధి పొందారు
ఈ తీర్పును గౌరవించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ముడా అక్రమాల నేపథ్యం లో సీఎం కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని సామాజిక కార్యకర్త టి.జె. అబ్రహం ఫిర్యాదు చేశారు. ఆగస్టు 16న గవర్నర్, ముఖ్యమంత్రిని విచారించాల్సి ఉండగా, మంత్రివర్గం ఆదేశాలను రద్దు చేయాలని నిర్ణయించారు. అయితే గవర్నర్ దాన్ని అంగీకరించలేదు. మరోవైపు సీఎం హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.