'టీడీపీ నాయకులను సీఎం చేయడానికి నేను లేను'; పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయంలో దగ్గరపడుతుండటంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.
టీడీపీ- జనసేన పొత్తు దాదాపు ఖారారైందన్న ఊహాగానాల నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ శుక్రవారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్యనాయకుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సీఎం పీఠంపై తనకు ఆసక్తి లేదని గురువారం చెప్పిన పవన్ కల్యాణ్, శుక్రవారం అందుకు విరుద్ధంగా టీడీపీ నేతలను సీఎం చేసేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో జనసేన బలాన్ని కూడా గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవకుండా తనకు సీఎం పదవి ఇస్తారా అని ప్రశ్నించారు.
జనసేన
సీట్లు గెలవకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎలా అవుతా: పవన్
జనసేనకు ఓటు వేయకుండా ఎలా సీఎంను అవుతానని చెప్పారు. హైదరాబాద్‌లో మజ్లీస్‌కు వచ్చిన సీట్లు కూడా తనకు ఇక్కడ రాలేదన్నారు.
2009లో ప్రజారాజ్యంకు వచ్చిన స్థానాలను కూడా జనసేన గెలవలేకపోయినట్లు స్పష్టం చేశారు.
సీట్లు గెలవకుండా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎలా అవుతానని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో పవన్ కల్యాణ్ గురువారం కూడా సీఎం పీఠంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను సీఎం పదవిని డిమాండ్ చేయడం లేదని పవన్ చెప్పారు.
తాను టీడీపీ, బీజేపీలకు ఎలాంటి షరతులు పెట్టబోనని పవన్ ప్రకటించారు. 2019ఎన్నికల్లో జనసేన పార్టీకి ప్రజలు 30 సీట్లు ఇస్తే తాను సీఎం రేసులో ఉండేవాడినని అన్నారు. తాను సీఎం రేసులో లేనని పవన్ కల్యాణ్ అన్నారు.
జనసేన
జనసేన బలం ఉన్న స్థానాల్లో పోటీ: పవన్
ప్రజల్లో జనసేన సత్తా చూపించి పదవి సంపాదించుకోవాలని అన్నారు. ఎన్నికల పొత్తులకు సీఎం పదవి బెంచ్‌మార్క్ లేదా షరతు కాదని పవన్ అన్నారు.
పొత్తుల విషయంలో తన వైఖరి మారదని చెప్పారు. జనసేన బలం ఉన్న స్థానాల్లో పోటీ చేస్తుందన్నారు. కొన్ని సెగ్మెంట్లలో జనసేనకు 30 శాతం ఓటింగ్ ఉందని పవన్ చెప్పారు.
పొత్తుల ఆధారంగానే బీఆర్‌ఎస్, బీజేపీ బలపడ్డాయని పవన్ పేర్కొన్నారు. పొత్తు కోసం తమ పార్టీ నేతలను ఒప్పిస్తానని పవన్ ప్రకటించారు.
జూన్ 3 నుంచి తాను ఏపీలోనే ఉంటానని పవన్ ప్రకటించారు. పొత్తులు, సీఎం పదవిపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.