Rahul Gandhi: నాకు మోదీపై ద్వేషం లేదు: రాహుల్ గాంధీ
అమెరికాలో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్సిటీలో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మోదీ పట్ల తనకు ఎలాంటి ద్వేషం లేదని ఆయన తెలిపారు. "మీరు ఆశ్చర్యపోతారు,కానీ మోదీ పట్ల నాకు ఎలాంటి ద్వేషం లేదు.ఆయన చేసే పనులను, తీసుకునే నిర్ణయాలను నేను అర్థం చేసుకోగలను.అయితే,ఆయన అభిప్రాయాలు, నా అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నాయి.ఈ కారణంగా,నేను ఆయనతో ఏకీభవించలేను. కానీ,నేను ఆయనను ద్వేషించడం లేదా శత్రువుగా చూడటం లేదు.ఆయన చేసే పనులను అర్థం చేసుకున్నప్పటికీ, అవి మంచి ఫలితాలు ఇస్తాయో లేదా అనేది నాకు అనిపించదు. మా ఇద్దరివీ దృక్పథాలు విభిన్నంగా ఉన్నాయి" అని రాహుల్ అన్నారు.
రాహుల్ చేస్తున్న విమర్శలపై స్పదింస్తున్న బీజేపీ నేతలు
మరోవైపు, సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై రాహుల్ విమర్శలు గుప్పించారు. "ఆ ఎన్నికలు పారదర్శకంగా జరిగాయని నేను భావించట్లేదు. బీజేపీకి 240 సీట్లు రావాల్సిన అవసరం లేదు, కానీ వారికి ఆర్థికంగా అండ ఉంది. ఎన్నికల సంఘం కూడా వారికి అనుకూలంగా పనిచేసింది. మా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి, ప్రచారంపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు" అని రాహుల్ విమర్శించారు. బీజేపీ నేతలు, అమెరికా నుంచి రాహుల్ చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆయన విదేశీ గడ్డపై దేశాన్ని దేశం పరువు తీసేందుకే ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్ పర్యటనలో భాగంగా, కాంగ్రెస్ ఎంపీ పలు చట్టసభ్యులు, సీనియర్ అధికారులతో సమావేశం కానున్నారు.