Page Loader
Sonam Raghuvanshi Case: 'నేనే నా భర్తను చంపించాను..': మేఘాలయ పోలీసుల ముందు ఒప్పుకున్న సోనమ్..
'నేనే నా భర్తను చంపించాను..': మేఘాలయ పోలీసుల ముందు ఒప్పుకున్న సోనమ్..

Sonam Raghuvanshi Case: 'నేనే నా భర్తను చంపించాను..': మేఘాలయ పోలీసుల ముందు ఒప్పుకున్న సోనమ్..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2025
03:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా సోనమ్ రఘువంశీ కేసు తీవ్ర కలకలం రేపుతోంది. హనీమూన్‌కు తీసుకెళ్లిన భర్తను,క్రూరంగా కిరాయి గూండాలతో హత్య చేయించిన ఘటన ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. మే23వ తేదీ నుంచి అదృశ్యమైన రాజా రఘువంశీ మృతదేహం జూన్ 2న మేఘాలయలోని కాసీ కొండల ప్రాంతంలో లభ్యమైంది. దీని ఆధారంగా పోలీసులు ఈ ఘటనను హత్యగా గుర్తించారు. మృతదేహం వెలుగులోకి వచ్చిన తర్వాత రాజా భార్య సోనమ్‌పై అనుమానాలు మొదలయ్యాయి. కేసును లోతుగా పరిశీలించిన పోలీసులకు కీలక సమాచారం దక్కింది. ఈ దిశగా దర్యాప్తు చేస్తుండగా జూన్ 8న సోనమ్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్ పోలీసులకు లొంగిపోయింది. పోలీసుల విచారణలో ఆమె తన ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి హత్యకు ముందుగా ప్లాన్ వేసినట్టు బయటపడింది.

వివరాలు 

పోలీసులు ముందు ఒప్పుకున్న సోనమ్.. 

ఇకపోతే, తన భర్తను చంపించిందన్న విషయాన్ని సోనమ్ స్వయంగా ఒప్పుకుంది. అయినప్పటికీ, పోలీసుల ముందు చేసిన అంగీకార ప్రకటనలు కోర్టులో సరైన ఆధారాలుగా పరిగణించబడవు. అందువల్ల, పోలీసులు ఆమె వాంగ్మూలానికి అనుగుణంగా పక్కా సాక్ష్యాలను కోర్టులో సమర్పించాల్సిన అవసరం ఏర్పడింది. హత్య కేసులో ప్రధాన పాత్రధారులైన సోనమ్, రాజ్ కుష్వాహాతో పాటు హత్యను అమలుపరిచిన ముగ్గురు కిరాయి హంతకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని అరెస్ట్ చేసిన తర్వాత సోనమ్ హత్య విషయాన్ని పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం.