
Priyanka Gandhi: 'మీ ప్రేమ, నమ్మకానికి రుణపడి ఉంటాను'.. విజయంపై ప్రియాంక గాంధీ ఎమోషనల్
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ తన తొలి పార్లమెంటు ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.
వయనాడ్ నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయాన్ని ప్రజలకే అంకితం చేశారు.
మీ ప్రేమ, నమ్మకానికి తాను సదా రుణపడి ఉంటానని ప్రియాంక భావోద్వేగపూరితంగా తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
పార్లమెంట్‌లో వయనాడ్ గొంతుకగా నిలవాలన్న తపన వ్యక్తం చేశారు. ఈ విజయం తన వ్యక్తిగత గెలుపు కాదని, వయనాడ్ ప్రజల ఆశయాల విజయమని భావిస్తున్నానని చెప్పారు.
మీ కలలు సాకారం చేసేందుకు పార్లమెంట్‌లో తన గళం వినిపించేందుకు సిద్ధమవుతున్నానని ప్రియాంక అన్నారు.
Details
ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన ప్రియాంక
తన విజయానికి తోడ్పడ్డ ప్రతి ఒక్కరికీ ప్రియాంక ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యూడీఎఫ్ సహచరులు, కేరళ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, వాలంటీర్ల తోడ్పాటు వల్లే ఈ విజయాన్ని సాధించగలిగానని ఆమె పేర్కొన్నారు.
రోజుకు 12 గంటల పాటు నిరంతరం తనతో కలిసి కష్టపడి పనిచేసిన తన టీమ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
తన కుటుంబం అందించిన ప్రేమ, మద్దతు అమెజింగ్! రాహుల్, నాకోసం నిలిచిన తీరుకు ఎంత చెప్పినా తక్కువే అంటూ చెప్పింది.