
IAF: గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధ విమానాల టేకాఫ్,ల్యాండింగ్
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పుర్‌లో గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలు అత్యవసర పరిస్థితుల్లో టేకాఫ్, ల్యాండింగ్‌ను సాధన చేస్తున్నాయి.
ఈ ప్రయోగం దాదాపు 3.5 కిలోమీటర్ల పొడవు కలిగిన ఎయిర్ స్ట్రిప్‌పై జరిగింది, ఇది ప్రత్యేకంగా యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనువుగా నిర్మించబడింది.
ఈ సందర్భంగా ఎక్స్‌ప్రెస్‌వే రహదారి రన్‌వేలా పనిచేసే అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ఈ అభ్యాసం రెండు విడతలుగా చేపడుతున్నారు. దయం-రాత్రి ల్యాండింగ్, టేకాఫ్ చేయనున్నారు. ఉదయం సాధారణ సమయాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.
రాత్రివేళల్లో మాత్రం సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్యలో అభ్యాసాలు జరుగుతాయి.
వివరాలు
భారత వాయుసేన నియంత్రణలోకి గంగా ఎక్స్‌ప్రెస్‌వే
భారత్,పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ రకమైన పరీక్షలు నిర్వహించబడటం విశేషంగా గమనించదగ్గది.
యుద్ధ విమానాల చొచ్చుకురావడాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా అప్రమత్తమైంది.
సుమారు 250 సీసీ కెమెరాలను ఈ ప్రాంతంలో అమర్చారు. గురువారం నుంచే గంగా ఎక్స్‌ప్రెస్‌వే పూర్తిగా భారత వాయుసేన నియంత్రణలోకి వచ్చింది.
ఈ ఎక్స్‌ప్రెస్‌వే, ఉత్తరప్రదేశ్‌లో యుద్ధ విమానాల ల్యాండింగ్‌కు అనుకూలంగా నిర్మించిన నాలుగో ఎక్స్‌ప్రెస్‌వేగా నిలిచింది.
అంతకు ముందు ఆగ్రా-లఖ్‌నవూ ఎక్స్‌ప్రెస్‌వే, పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే మరియు బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేల్లో ఇటువంటి సదుపాయాలు ఇప్పటికే ఏర్పాటు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై యుద్ధ విమానాల టేకాఫ్,ల్యాండింగ్
VIDEO | Uttar Pradesh: Preparations underway for IAF's drill on 3.5-km airstrip of the under-construction Ganga Expressway in Shahjahanpur. Visuals of an IAF aircraft at the spot.#UPNews #GangaExpressway
— Press Trust of India (@PTI_News) May 2, 2025
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/krCg0SV4KS