Page Loader
Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం

Indian Air Force: మరో వీడియో షేర్ చేసిన భారత సైన్యం..శత్రు దేశాలకు స్ట్రాంగ్‌ మెసేజ్‌..చూస్తే గూస్ బంప్స్ ఖాయం

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2025
03:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్‌' ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను నాశనం చేసిన సంగతి తెలిసిందే. ఈ చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్థాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. అయితే, భారత భద్రతా దళాలు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రత్యర్థి దేశానికి గట్టి హెచ్చరిక అందించాయి. అంతేకాక, ఈ ఆపరేషన్‌లో భారత్ ఇంకా పూర్తిస్థాయి చర్యలు చేపట్టలేదని, ఇప్పటివరకు కేవలం "ట్రైలర్" మాత్రమే చూపించామని, భవిష్యత్తులో పాక్ మరోసారి ప్రయత్నిస్తే అసలు "సినిమా" చూపిస్తామని భారత త్రివిధ దళాలు స్పష్టమైన సందేశం పంపిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల నుంచి వరుసగా శిక్షణా వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నాయి.

వివరాలు 

 వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా పాపులర్ 

తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో మరో శక్తివంతమైన వీడియోను విడుదల చేసింది. 'ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎప్పుడూ దృఢ సంకల్పంతో స్పందిస్తుంది' అనే శీర్షికతో పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. వైమానిక దళం సిద్ధంగా ఉండే తీరును, అత్యాధునిక ఆయుధాల వినియోగాన్ని, శత్రు స్థావరాలపై క్షిపణుల దాడులను, మానవ వనరుల ప్రతిస్పందన సామర్థ్యాన్ని సమగ్రంగా చూపించారు. వీడియో మొత్తంలో శక్తిని, సామర్థ్యాన్ని ప్రతిబింబించే విధంగా వైమానిక విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే ఉత్సాహభరితమైన సంగీతం వీడియో ప్రభావాన్ని మరింతగా పెంచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా పాపులర్ అవుతోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేసిన ట్వీట్