
IIT Bombay:ప్రొఫెసర్,స్పీకర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఐఐటీ బాంబే విద్యార్థులు
ఈ వార్తాకథనం ఏంటి
క్యాంపస్ పరిధిలో వర్చువల్ లెక్చర్ సందర్భంగా ఓ ప్రొఫెసర్, గెస్ట్ స్పీకర్ పాలస్తీనా-హమాస్ ఉగ్రవాదులకు అనుకూలంగా మాట్లాడడంతో ఐఐటీ బాంబే విద్యార్థులు పోలీసులుకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 6న వర్చువల్ లెక్చర్ సందర్భంగా ఉగ్రవాదులకు మద్దతుగా ప్రొఫెసర్, స్పీకర్‌ల మాట్లాడారని, ఈ మేరకు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.
ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య గత నెల రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
details
దేశ భద్రతా చర్యలకు విఘాతం కలిగేలా మాట్లాడారు : విద్యార్థులు
భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ఐఐటీ బాంబేకు చెందిన హ్యుమనిటీస్, సోషల్ సైన్సెస్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ శర్మిష్ట సాహా, అకాడెమిక్ కోర్సు కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథి లెక్చరర్ గా సుధాన్వ దేశ్‌పాండే హాజరయ్యారు.
అయితే రాడికల్ లెఫ్టిస్ట్ దేశ్‌పాండేను, ప్రొఫెసర్ శర్మిష్ట తన పదవిని ఉపయోగించి పాండేను గెస్ట్ స్పీకర్‌గా ఆహ్వానించారని విద్యార్ధులు ఫిర్యాదులో వివరించారు.
పాలస్తీనా ఉగ్రవాదులు జకారియా జుబేది, ఘసన్ కనఫనిలను దేశ్‌పాండే గొప్పగా కీర్తించడం, సాయుధ తిరుగుబాటును సమర్ధించారని విద్యార్ధులు లేఖలో రాశారు.
ఉగ్రవాద సిద్ధాంతాలను విద్యార్థులకు నూరి పోస్తున్నారని, ఈ క్రమంలోనే ప్రేరేపిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా మాట్లాడటం భద్రతా ముప్పుకు దారి తీసే ప్రమాదం ఉందన్నారు.