LOADING...
Heavy Rain Alert: వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే అవకాశం.. జాగ్రత్తలు తప్పనిసరి!
Rain Alert: వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే అవకాశం

Heavy Rain Alert: వచ్చే 3 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగులు పడే అవకాశం.. జాగ్రత్తలు తప్పనిసరి!

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
09:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య దిశలో బంగాళాఖాతం వరకు రుతుపవన ప్రభావం కొనసాగుతోంది. దక్షిణ ఒడిస్సా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు సమీపంలో సముద్రమట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాతం కొనసాగుతుంది. దీనివల్ల సెప్టెంబర్ 9న తెలంగాణలోని అనేక జిల్లాల్లో మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

వివరాలు 

తెలంగాణలోని వర్షం కురిసే అవకాశం ఉన్న జిల్లాలు 

ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. రేపటి వర్ష సూచన జయశంకర్ భూపాలపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో కూడా మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు, రేపు తెలంగాణలో అన్ని జిల్లాల్లో బలమైన గాలులు కూడా వీచే అవకాశముందని సూచించారు.

వివరాలు 

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన

బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనం కారణంగా, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు భారీ వర్షాల హెచ్చరిక జారీ అయింది. ముఖ్యంగా: మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లాలో రాబోయే 3 గంటల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు కనపడే అవకాశం ఉంది. గాలుల వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశముందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.